ఆ సెంటిమెంట్ వల్ల భయపడుతున్న నిధి అగర్వాల్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఫస్ట్ హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటే సెకండ్ హీరోయిన్ కు మాత్రం తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

 Actress Nidhi Agarwal Fear About This Sentiment-TeluguStop.com

అదే సమయంలో త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్లుగా నటించిన హీరోయిన్లకు తరువాత కాలంలో సినిమా ఆఫర్లు కూడా తగ్గుతుండటం గమనార్హం.

అత్తారింటికి దారేది సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించగా సమంత ఇప్పటికీ బిజీగా ఉంటే ప్రణీతకు మాత్రం చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు.

 Actress Nidhi Agarwal Fear About This Sentiment-ఆ సెంటిమెంట్ వల్ల భయపడుతున్న నిధి అగర్వాల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నిత్యామీనన్ కు సైతం తెలుగులో అవకాశాలు ఎక్కువగా లేవనే సంగతి తెలిసిందే.అజ్ఞాతవాసి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కు సైతం తర్వాత కాలంలో ఆఫర్లు తగ్గాయి.

Telugu Feeling Tension, Mahesh Babu, Nidhi Agarwal, That Sentiment-Movie

అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈషా రెబ్బాకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు.గతేడాది రిలీజైన అల వైకుంఠపురములో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్ కు తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు వచ్చినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.త్రివిక్రమ్ తరువాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ నిధి అగర్వాల్ కు దక్కినా ఆమెను ఈ సెంటిమెంట్ భయపెడుతున్నట్టు తెలుస్తోంది.

నిధి అగర్వాల్ మహేష్ బాబుకు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ సినిమాలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే లేదా జాన్వీ కపూర్ ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.

#Feeling Tension #Nidhi Agarwal #Mahesh Babu #That Sentiment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు