నాకు అంత సీన్ లేదు.. ఇప్పటికీ అవకాశాల కోసం అడుక్కుంటూనే ఉన్నా: నటి

బాలీవుడ్ బ్యూటీ నియా శర్మ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

 Actress Nia Sharma Talk About Her Break From Work, Actress Nia Sharma , Television Actress,bigg Boss Show, Social Media Trolls,jamai 2.0-TeluguStop.com

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది.ఈమె గతేడాది బిగ్‌బాస్‌ షోలో అలరించింది విషయం తెలిసిందే.

బిగ్ బాస్ తరువాత నియా శర్మ జమై 2 అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది.ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

 Actress Nia Sharma Talk About Her Break From Work, Actress Nia Sharma , Television Actress,Bigg Boss Show, Social Media Trolls,Jamai 2.0 -నాకు అంత సీన్ లేదు.. ఇప్పటికీ అవకాశాల కోసం అడుక్కుంటూనే ఉన్నా: నటి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆ తర్వాత ఏ సీరియల్‌లోనూ, వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనేలేదు.

దీంతో అందరూ నియా శర్మ బ్రేక్ తీసుకుంది అని అనుకున్నారు.

కానీ తాను బ్రేక్‌ తీసుకోలేదని, అదే వచ్చింది అని అంటోంది బుల్లితెర నటి నియా శర్మ.తనకు స్వచ్ఛందంగా బ్రేక్‌ తీసుకునేంత సీన్‌ లేదని తాను ఆ స్థాయిలో లేను అని చెప్పుకొచ్చింది నియా శర్మ.

ఇప్పటికీ అవకాశాల కోసం, డబ్బులు సంపాదించడం కోసం అడుక్కుంటూనే ఉన్నాను.నాకు పని కావాలి.అలా అని ఏది పడితే అది చేయలేను.మంచి రోల్‌ అనిపిస్తేనే చేస్తాను అని తెలిపింది.

మంచి మంచి అవకాశాల కోసం నెలలు, సంవత్సరాల తరబడి ఎదురుచూస్తాను.

దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు ఇదంత మంచిది కాదు.ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని బాధిస్తుంది.శూన్యంలోకి నెట్టేస్తుంది అని తెలిపింది శర్మ.

ఆడిషన్‌ చేసి చాలాకాలమే అయింది.అంతా ఆగిపోయింది.

కానీ నాకంటూ ఒక రోజు వస్తుంది.ఆరోజు ఏదైనా పెద్ద అవకాశమే వరిస్తుంది అన్న ఆశతో ఉన్నాను.

అప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తాను అని చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube