ఆ నటుడితో డేటింగ్ ఎంతవరకు వెళ్తుందో అంటున్న నటి..!

హిందీ టీవీ నటి నియా శర్మ గురించి హిందీ ప్రేక్షకులకు తెలిసిందే.ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Hindi Tv Actress Nia Sharma Opens About Her Relationship With Rahul Sudhir , Ni-TeluguStop.com

తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను తన ఫాలోవర్స్ తో బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా ఈమె షేర్ చేసిన ఫోటోలకు నెటి జనుల నుండి విపరీతమైన ట్రోల్స్, కామెంట్స్ కూడా వస్తుంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా అని ఒకరితో డేటింగ్ లో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

నియా శర్మ టీవీ నటుడు రాహుల్ సుధీర్ తో డేటింగ్ చేస్తున్నట్లు బీ టౌన్ లో బాగా వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తను రిలేషన్ షిప్ లో ఉన్న విషయం గురించి తెలిపింది.లాంగ్ రిలేషన్ షిప్ లో ఉందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా తనకు చాలా సార్లు నిరాశ ఎదురైందట‌.

అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా తన రిలేషన్ ను నడిపిస్తుందట.ఇక ఆమె రాహుల్ సుధీర్ నే తన లైఫ్ పార్ట్నర్ అని ఖచ్చితంగా నమ్మినప్పుడే ఈ విషయం గురించి మీడియాతో తెలుపుతుందట‌.

ఎందుకంటే చాలామంది ప్రేమ జంటలు మీడియా ద్వారా బయటపడగా వారు విడిపోవడం దగ్గర్నుంచి చూశానంటూ.అలా అని వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదని తెలిపింది.ఇక తను పెళ్ళి చేసుకునే వ్యక్తి గురించి చాలా ప్రైవేసీ గా ఉంచాలనుకుంటుందట.ఇదిలా ఉంటే చాలా కాలం నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నానంటూ, చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో అని అంతే కాకుండా ఇదే లాంగ్ రిలేషన్ అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తను డాన్స్ చేసిన వీడియోను పంచుకుంది.అంతేకాకుండా దీనికి బ్లాక్ లేదా వైట్.మధ్యలో ఏది ఉండకూడదు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube