కాబోయే భర్త విఘ్నేష్ కు సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార.. ఏం చేశారంటే?

స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నయనతార, విఘ్నేష్ శివన్ లకు ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

 Actress Nayanthara Birthday Surprise To Vignesh Shivan-TeluguStop.com

తాజాగా నయనతార విఘ్నేష్ శివన్ పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు.వరుస సినిమాలతో బిజీగా ఉండే నయనతార తాజాగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

విఘ్నేష్ బర్త్ డే కావడంతో నయనతార స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు సర్ప్రైజ్ ఇచ్చారు.

 Actress Nayanthara Birthday Surprise To Vignesh Shivan-కాబోయే భర్త విఘ్నేష్ కు సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార.. ఏం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నయనతతార ఈ పుట్టినరోజు వేడుకకు విఘ్నేష్ కు తెలియకుండా విఘ్నేష్ స్నేహితులందరినీ ఆహ్వానించారు.

నయనతార ఇచ్చిన సర్ప్రైజ్ ను చూసి ఆశ్చర్యపోవడం విఘ్నేష్ వంతైంది.విఘ్నేష్ శివన్ నయనతార ఇచ్చిన సర్ప్రైజ్ గురించి స్పందిస్తూ నా లైఫ్ లో భాగమై చాలా బిజీగా ఉన్నా తనకోసం అందమైన సర్ప్రైజ్ ను ఇచ్చినందుకు ధన్యవాదాలు బంగారం అంటూ విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.
నయనతార గతంలో పలువురు సినీ ప్రముఖులతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచినా వేర్వేరు కారణాల వల్ల బ్రేకప్ చెప్పారు.నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ చిగురించింది.

ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమించుకుని పెద్దలను పెళ్లికి ఒప్పించారు.త్వరలో నయన్ విఘ్నేష్ పెళ్లి జరగనుండగా డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.

ప్రస్తుతం నయనతార తమిళంలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాతు వాక్కుల రెండు కాదల్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.మరోవైపు ఆమె నటించిన అన్నాత్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.నయన్ ఈ రెండు సినిమాలతో మరో రెండు విజయాలు సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.డిసెంబర్ నెలలో నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

#Vignesh Shivan #Nayanatara #Vignesh Shivan #Surprise #Vignesh Shivan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు