రవికృష్ణతో బంధం గుట్టు విప్పిన నవ్య.. ఏమన్నారంటే..?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ వారం ప్రోమో రిలీజ్ కాగా స్నేహమేరా బంధం పేరుతో ప్రసారమైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

 Actress Navyaswamy Reveals Her Relationship With Ravikrishna-TeluguStop.com

సీరియల్ నటి నవ్యస్వామి, సీరియల్ నటుడు రవికృష్ణ మధ్య ఏదో ఉందని గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో ఒక ఈవెంట్ రవికృష్ణకు నవ్యస్వామికి పెళ్లి అని ప్రసారం చేయడంతో రవికృష్ణ, నవ్యస్వామి మధ్య ఏదో ఉందని వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది.

 Actress Navyaswamy Reveals Her Relationship With Ravikrishna-రవికృష్ణతో బంధం గుట్టు విప్పిన నవ్య.. ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా రిలీజైన ప్రోమోలో సుడిగాలి సుధీర్ రవికృష్ణ, నవ్యస్వామిని మీ మధ్య ఉన్న ది ఫ్రెండ్ షిప్ మాత్రమేనా.? ఇంకేమైనా ఉందా.? అని అడగగా నూటికి నూరు శాతం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని నవ్యస్వామి వెల్లడిస్తారు.ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

సుధీర్ ప్రియదర్శిని నా చావు నేను చస్తా నీకెందుకు అనే బుక్ రాశారు కదా అని అడగగా నీకెందుకు బే హౌలే అనేవాళ్లు ఆ బుక్ ను పబ్లిష్ చేస్తున్నారని ప్రియదర్శి చెప్పారు.సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి హ్యాపీడేస్ లోని ఓ మై ఫ్రెండ్ పాటను అద్భుతంగా పాడారు.

పంచ్ ప్రసాద్ వేసిన పంచ్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.నూకరాజు గుడ్డివాడిగా కనిపించగా ఇమ్మాన్యుయేల్ బెస్ట్ ఫ్రెండ్ గా స్కిట్ చేసి ఆకట్టుకున్నారు.

తన కళ్లలో ఒక కన్నును స్నేహితునికి దానం చేసి తాను రెండు కళ్లు ఇవ్వాలని అనుకున్నానని కానీ రెండు కళ్లు ఇస్తే చూడలేను కాబట్టే ఒక కన్నును దానం చేశానని ఇమ్మాన్యుయేల్ నూకరాజుకు చెబుతాడు.ఈ ఆదివారం మధ్యాహ్నం 1కు ఈ షో ప్రసారం కానుండటం గమనార్హం.

#SrideviDrama #Ravikrishna #Navyaswamy #Relationship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు