బొద్దు ముద్దుగుమ్మ నమిత సినిమాలకు మెల్లమెల్లగా దూరం అవుతూ వస్తోంది.తెలుగు మరియు తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ తమిళ సుందరి సినిమాలకు పూర్తిగా స్వస్థి చెప్పినట్లుగా తెలుస్తోంది.
బొద్దుగుమ్మ నమిత తాజాగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్దం అయ్యింది.తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో ఈమె అన్నాడీఎంకే పార్టీలో చేరింది.
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి నడుస్తున్న విషయం తెల్సిందే.ఆ సందర్బంగానే ఎన్నికల్లో ఈమె పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
జయలలిత మంచి స్థానం చూసి నమితకు అప్పగించే అవకాశాలు లేక పోలేదు అంటూ తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.తమిళనాడులో నమితకు భారీ క్రేజ్ ఉంది.
ఆ క్రేజ్‌తో తప్పకుండా నమిత గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.మొత్తానికి హాట్ బ్యూటీ నమిత రాజకీయ ఎంట్రీ అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.