బీజేపీలో చేరిన బొద్దుగుమ్మ నమిత  

Actress Namitha Joins Bjp Tamil Nadu-aidmk,dmk,joins Bjp Tamil Nadu,tamil Politics

జెమిని సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ నమిత.ఆ సినిమా తర్వాత ఈ భామ తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు.అయితే ఊహించని విధంగా ఈ భామ తన శరీరాన్ని అడుపుచేసుకోలేక భారీగా పెరిగేసింది.పొడవుగా ఉండటంతో పాటు దానికి తగ్గ భారీకాయం ఈ భామతో ఉండటంతో తెలుగు సినిమా దర్శకుడు నమితని పెద్దగా పట్టించుకోవడం మానేశారు.

Actress Namitha Joins Bjp Tamil Nadu-aidmk,dmk,joins Bjp Tamil Nadu,tamil Politics తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు .-Actress Namitha Joins BJP Tamil Nadu-Aidmk Dmk Joins Bjp Nadu Politics

తెలుగులో ఆమె చివరిగా బాలకృష్ణతో సింహ సినిమాలో నటించింది.అయితే తమిళంలో అడపా దడపా కొన్ని సినిమాలలో మెప్పించింది.ఆ మధ్య ఓ తెలుగు కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపొయింది.అయితే సినిమాల మీద ఇష్టంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ అవలేదు.

దీంతో ఈ భామ తమిళనాడు రాజకీయాలలో బిజీ కావాలని ప్రయత్నం మొదలెట్టింది.అందులో భాగంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ జెండా కప్పుకుంది.ప్రస్తుతం తెలంగాణలో డీఏంకె, అన్నా డిఏంకె పార్టీలలోనాయకత్వ సమస్య ఉండటంతో బీజేపీ తమిళనాడులో బలపడే ప్రయత్నం చేస్తుంది.ఈ నేపధ్యంలో ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని అనుకున్న నమిత భర్తతో కలిసి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకుంది.

ఈ నేపధ్యంలో తమిళనాడులో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలని ఇప్పడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.