ఇంట్లో కూర్చునే మాట్లాడండి.. ఫోన్ నంబర్ ఇచ్చిన నమిత..?

గతేడాదితో పోలిస్తే శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలు నెలకొన్నాయి.కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు నటి నమిత ఇంట్లో కూర్చొని మాట్లాడండి అంటూ ఫోన్ నంబర్ ను ఇచ్చారు.

 Actress Namitha Help To Covid 19 Patients-TeluguStop.com

కరోనా బాధితులు సహాయం అవసరమైతే 080 68173286 కాల్ చేయాలని నమిత సూచించారు.కరోనా లక్షణాలతో బాధ పడుతుంటే ఆందోళన చెందవద్దని నమిత పేర్కొన్నారు.

కరోనా బాధితులు భయంభయంతో జీవనం సాగిస్తున్నారని భారతీయ జనతా యువ మోర్చా హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా డాక్టర్ ను ఫ్రీగా సంప్రదించే అవకాశం కల్పిస్తున్నామని నమిత పేర్కొన్నారు.కరోనా బాధితులకు మేలు జరిగేలా నమిత చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 Actress Namitha Help To Covid 19 Patients-ఇంట్లో కూర్చునే మాట్లాడండి.. ఫోన్ నంబర్ ఇచ్చిన నమిత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో సినీ సెలబ్రిటీలు సాయం చేయడానికి తమ వంతుగా ముందుకు వస్తుండటం గమనార్హం.

దేశంలో ప్రతిరోజూ మూడున్నర లక్షల కరోనా కేసులు నమోదవుతుండగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.

నమిత ఐడియాను నెటిజన్లు ప్రశంసిస్తూ ఆమె ఆలోచన గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు.నమిత తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని కొంతమంది పేర్కొన్నారు.

అయితే మరి కొందరు మాత్రం నమితను విమర్శిస్తున్నారు.

నమిత కరోనాను కూడా రాజకీయ కోణంలో వినియోగించుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు నమితకు గత కొన్నేళ్ల నుంచి సినిమా ఆఫర్లు తగ్గుతున్న సంగతి తెలిసిందే.కొత్త హీరోయిన్ల రాకతో నమితకు హీరోయిన్ రోల్స్ కు ఛాన్స్ రావడం లేదు.

రాజకీయాల ద్వారా గుర్తింపును సంపాదించుకోవడానికి నమిత తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.నమితకు సినిమా ఆఫర్లు తగ్గినా ఆమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

#Namitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు