కూతురుని హీరోయిన్ చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ అత్త  

Actress Nadhiya Plan To Introduce Her Daughter For Heroine - Telugu, Kollywood, South Cinema, Tollywood

నదియా అంటే ప్రస్తుతం టాలీవుడ్ చాలా పాపులర్ పేరు.మిర్చి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ తరువాత అత్తారింటికి దారేది సినిమాతో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

 Actress Nadhiya Plan To Introduce Her Daughter For Heroine

సెకండ్ ఇన్నింగ్ లో ఈమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.సౌత్ లో రమ్యకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా అనే చెప్పాలి.1985లో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలందరితో జత కట్టిన నదియా మూడేళ్ళలోనే పెళ్లి చేసుకొని సినిమాలకి స్వస్తి చెప్పింది.అమెరికన్ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది.

తరువాత చాలా గ్యాప్ తర్వాత తమిళంలో అమ్మ నాన్న తమిళమ్మాయి రీమేక్ లో జయంరవికి తల్లిగా రీఎంట్రీ ఇచ్చింది.

కూతురుని హీరోయిన్ చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ అత్త-Movie-Telugu Tollywood Photo Image

ఆ తరువాత తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

తెలుగులో అత్తారింటికి దారేది సినిమాతో తన గ్లామర్, నటనతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా తమిళంలో మాత్రం చేస్తుంది.

ఇక ఆమెకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కూతుళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది నదియా.

సనమ్, జానాలతో కలిసి నదియా దిగిన ఫోటో వైరల్ అవుతుంది.ఇక పెద్ద కూతురు కూడా అచ్చం తనలాగే ఉండటంతో హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

దానికి తగ్గట్లే తమిళంలో నదియా కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయడానికి దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా.ఒకరిద్దరు దర్శకులు ఆమె దగ్గర తమ నిర్ణయాన్ని వ్యక్తం చేయగా ఆమె కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుందని, అయితే కూతురు నిర్ణయం బట్టి దర్శకులకి చెప్పాలని చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Nadhiya Plan To Introduce Her Daughter For Heroine Related Telugu News,Photos/Pics,Images..

footer-test