ఆ దర్శకుడిని పవన్‌ హీరోయిన్‌ చెప్పుతో కొట్టిందట!   Actress Mumtaj Slaps Movie Director     2018-10-23   09:22:20  IST  Ramesh P

మీటూ ఉద్యమంతో బాలీవుడ్‌ మరియు సౌత్‌ సినిమా పరిశ్రమలు అట్టుడికి పోతున్నాయి. స్టార్స్‌గా, సూపర్‌ స్టార్స్‌గా వెలుగు వెలుగుతున్న వారు కూడా ఇప్పుడు మసకబారి పోయే పరిస్థితి వచ్చింది. ఎంతో మంది స్టార్స్‌పై మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో మొదలైన ఈ తంతు మెల్ల మెల్లగా కోలీవుడ్‌కు చేరింది. అక్కడ నుండి ఇతర పరిశ్రమలకు కూడా పాకుతోంది. తాజాగా తమిళ నటి ముంతాజ్‌ ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఖుషి చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈమద్య అత్తారింటికి దారేది చిత్రంలో కూడా నటించింది. ఇక బిగ్‌ బాస్‌ తో మరొక్కసారి తమిళనాట స్టార్‌డంను దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. తనను ఒక దర్శకుడు విసిగిస్తూ ఉంటే, అతడికి చెప్పుతో కొట్టి బుద్ది చెప్పాను అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న మీటూ ఉద్యమంతో ఆడవారికి మంచి జరుగుతుందని భావిస్తున్నాను. నేను కూడా చాలా సార్లు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను. అయితే వాటిని ఒక స్థాయి వరకు భరించాను. కొన్ని సార్లు ఆ స్థాయి మించితే మాత్రం నేను భరస్ట్‌ అవుతాను. ఒకానొక సమయంలో నన్ను ఒక దర్శకుడు షాట్‌ పేరుతో పదే పదే హింసించాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్‌ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో నేను అతడి చెంప పగుల కొట్టాను అంటూ ముంతాజ్‌ చెప్పుకొచ్చింది.

Actress Mumtaj Slaps Movie Director-

మీటూ అంటూ ఎంతో మంది లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నీంటికి కూడా సాక్ష్యాధారాలు ఉండాలి. అలా ఉంటేనే మీటూ ఉద్యమం నిలుస్తుంది. అలా కాదని, ఏదో నిందలు వేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఉద్యమ స్ఫూర్తి దెబ్బ తింటుందని ఆమె చెప్పుకొచ్చింది. నేను మీటూలో భాగంగా తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పలేదని, తన అనుభవాలను మాత్రమే వివరించాను అంటూ పేర్కొంది.