ఆ టార్చర్ తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ బుల్లితెర నటి మోనికా భడోరియా( Monika Bhadoriya ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ నటికి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Actress Mounika Shocking Comments Goes Viral In Social Media,mounika , Social Me-TeluguStop.com

ఈ నటి తారక్ మెహతా కా ఉల్టా చష్మా షో( Taarak Mehta Ka Ooltah Chashmah ) నిర్మాతలు తనను వేధించారని చెప్పుకొచ్చారు.ఒక షో కోసం పని చేస్తున్న సమయంలో నన్ను టార్చర్ చేశారని ఆ సమయంలో చనిపోవాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

ఆ షో ప్రొడ్యూసర్లు తనతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని అయితే నాకు ఇవ్వాల్సిన పారితోషికం( Remuneration ) కూడా ఇవ్వలేదని ఆమె అన్నారు.ఈ షోలో మోనిక బావ్రీ అనే పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం.

ఆ షో సెట్స్ లో ఉన్న సమయంలో నాకు నరకం కనిపించిందని మోనిక వెల్లడించారు.తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో షో యూనిట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించడం లేదని ఆమె పేర్కొన్నారు.

నేను రాత్రి సమయంలో ఆస్పత్రిలో అమ్మ దగ్గర ఉండేదానినని మోనిక పేర్కొన్నారు.కానీ వాళ్లు మాత్రం నా పరిస్థితి తెలిసి కూడా ఉదయాన్నే షూటింగ్ కు రావాలని చెప్పేవారని ఆమె చెప్పుకొచ్చారు.నా మానసిక స్థితి బాలేదని చెప్పినా షూటింగ్ కు రావాలని బలవంతం చేసేవారని మోనిక చెప్పుకొచ్చారు.షూట్ కు వెళితే మాత్రం అక్కడ నన్ను వెయిట్ చేయించేవారని ఆమె తెలిపారు.

మా కుటుంబంలో నేను ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నానని తక్కువ సమయంలోనే అమ్మను, అమ్మమ్మను కోల్పోయానని మోనిక పేర్కొన్నారు.మోనిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మోనికకు రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ నటికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube