ఆ అభిమానిపై సీరియస్ అయిన మోనాల్ .. ఏం జరిగిందంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామర్ గా కనిపించడం ద్వారా మోనాల్ గజ్జర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 Actress Monal Gajjar Serious On Her Fan Why Because, Fake Youtube Channel,  Mona-TeluguStop.com

మోనాల్ గజ్జర్ ఎప్పుడూ కూల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ బ్యూటీ ఒక నెటిజన్ పై సీరియస్ అయ్యారు.

తన పేరుతో రన్ అవుతున్న యూట్యూబ్ ఛానల్ నుంచి అభిమానులు అన్ సబ్ స్క్రైబ్ కావాలని ఆమె కోరారు.

Telugu Allari Naresh, Youtube Channel, Monal Gajjar, Fan, Sudigadu, Tollywood, W

మోనాల్ అభిమాని అయిన ఒక వ్యక్తి మోనాల్ అఫీషియల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నారు.మోనాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలు ఆ యూట్యూబ్ ఛానల్ లో కూడా దర్శనమిస్తున్నాయి.అయితే తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కాకపోయినా తన పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుండటంతో మోనాల్ సీరియస్ అయ్యారు.

ఆ యూట్యూబ్ ఛానల్ తన ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టిస్తుందని ఆమె భావిస్తున్నారు.

Telugu Allari Naresh, Youtube Channel, Monal Gajjar, Fan, Sudigadu, Tollywood, W

మోనాల్ గజ్జర్ సొంతూరు గుజరాత్ లోని అహ్మదాబాద్ కాగా నటన అంటే ఇష్టం ఉన్న మోనాల్ మిస్ గుజరాత్ గా ఎంపికయ్యారు.అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సుడిగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోనాల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఆ సినిమా సక్సెస్ సాధించడంతో మోనాల్ గజ్జర్ కు నటిగా ఆఫర్లు పెరిగాయి.

అయితే సుడిగాడు మినహా మోనాల్ కెరీర్ లో మరో హిట్ లేకపోవడం గమనార్హం.

బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత మోనాల్ కు అడపాదడపా ఆఫర్లు వచ్చినా కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు.

త్వరలో మోనాల్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఆ వెబ్ సిరీస్ తో మోనాల్ జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube