బాలీవుడ్ లో మరో విషాదం.... కిటో డైటే కారణం....

బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస గా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ 2020 వ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీ లో పెను విషాదాలను నింపింది.

 Actress Misti Mukherjee Passes Away After Kidney Failure, Actress Misti Mukherje-TeluguStop.com

ఇటీవలకాలంలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, వాజిత్ ఖాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశాంత్ రాజ్‌పుత్ తదితర పలువురు సినీ తారలు అందరూ ఈ సంవత్సరం లోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఇంకా వారి మరణాల నుంచి బయటపడకుండానే ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ నటి మిస్తి ముఖర్జీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

అయితే ఆమె మృతి కి కారణం ఆమె ఫాలో అయిన కిటో డైటే అని తెలుస్తుంది.పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించారు.

అయితే ఆమె ఆ మధ్య బరువు తగ్గేందుకు కిటో డైట్ ను ఫాలో అయ్యారని,అయితే అది వికటించడం తోనే ఆమె కిడ్నీలు ఫెయిల్యూర్ అయినట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.కిటో డైట్ వికటించి ఆమె కిడ్నీ ల సమస్యలు వచ్చాయని ఆ కారణంగానే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మ్యూజిక్ వీడియోలలో ఆమె నటించిన ఆమె సుభాష్ ఘయ్ 2014లో విడుదల చేసిన ‘కాంచి.ది అన్‌బ్రేకబుల్’ చిత్రంలో మిస్తి ముఖర్జీ ప్రధాన పాత్రను పోషించారు.ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.ఆ తర్వాత పలు బాలీవుడ్, బెంగాలీ, తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.2019లో విడుదలైన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలోనూ ఆమె నటించింది.అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం తో చికిత్స చేయించినా ఫలితం లేకుండా ఆమె శుక్రవారం రాత్రి బెంగుళూర్ లో కన్నుమూసినట్లు తెలుస్తుంది.

మిస్తి ముఖర్జీకి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు.

శనివారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

జీవిత చివరి రోజుల్లో ఆమె తీవ్ర నొప్పిని భరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.సినిమాల్లో స్లిమ్ గా కనిపించడం కోసం నటీనటులు ఫాలో అవుతున్న డైట్ లతో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube