బ్రేకప్ తర్వాత మెహ్రీన్ షాకింగ్ కామెంట్లు.. వాళ్లు ప్రమాదకరమంటూ?

సినిమా హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని మెహ్రీన్ ఈ మధ్య కాలంలో అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నానని ప్రకటన చేసి అభిమానులతో పాటు నెటిజన్లను సైతం అవాకయ్యేలా చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ పంజాబీ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Actress Mehreen Sensational Post About Dangerous Woman , Dangerous Woman , Mehre-TeluguStop.com

భవ్య భిష్ణోయ్ తో పెళ్లిని పెటాకులు చేసుకున్న మెహ్రీన్ సోషల్ మీడియా ఖాతాలలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటన చేయడంతో కొంతమంది భవ్య భిష్ణోయ్ ను టార్గెట్ చేస్తూ అతనిని ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టగా భవ్య భిష్ణోయ్ తనను ట్రోల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు పెళ్లిని రద్దు చేసుకున్న మెహ్రీన్ సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.మారుతి దర్శకత్వంలో గతంలో కొన్ని సినిమాలు చేసిన మెహ్రీన్ ఏక్ మినీ కథ సినిమాతో సక్సెస్ సాధించిన సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ఎఫ్2 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో మెహ్రీన్ హనీ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఎఫ్2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఎఫ్3 సినిమా ఆ సినిమాను హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఎఫ్3 సినిమా ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.తాజాగా మెహ్రీన్ గ్లామరస్ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆ ఫోటోకు అదిరిపోయే కొటేషన్ ను కూడా యాడ్ చేశారు.

తన వద్ద ఉన్న కత్తితో సహాయాన్ని పొందడానికి ఇష్టపడని, సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడి జీవించే సత్తా ఉన్న మహిళలు అత్యంత ప్రమాదకరమైన ఆడవాళ్లు అని మెహ్రీన్ తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు.మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ కు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube