కట్నంపై స్పందించిన మెహ్రీన్.. అలాంటి మనుషులు కాదంటూ..?

సాధారణంగా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్లు పెళ్లిపై దృష్టి పెట్టరు.కానీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే హీరోయిన్ మెహ్రీన్ మాత్రం భవ్య బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతున్నారు.

 Actress Mehreen Interesting Comments About Dowry, Actress Mehreen ,bhavya Bhishn-TeluguStop.com

గత నెల 12వ తేదీన మెహ్రీన్ భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థ వేడుక జరిగింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మెహ్రీన్ కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ గురించి, పెళ్లి విశేషాల గురించి చెప్పుకొచ్చారు.

హీరోయిన్ గా కెరీర్ ను మొదలు పెట్టాలని అనుకున్న సమయంలోనే 26 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటానని చెప్పానని ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుందని ఆ సరైన సమయంలో అనుకున్నది అనుకున్న విధంగా జరిగితే జీవితం బాగుంటుందని మెహ్రీన్ తెలిపారు.తమది లవ్ మ్యారేజ్ కాదని అరేంజ్డ్ మ్యారేజ్ అని ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భవ్య బిష్ణోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని ఆమె అన్నారు.

Telugu Actress Mehreen, Bhavya Bhishnoy, Dowry-Movie

లాక్ డౌన్ తమకు చాలా హెల్ప్ చేసిందని భవ్య బిష్ణోయ్ తో పరిచయం మొదలైన ఆరు రోజులకే తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మెహ్రీన్ పేర్కొన్నారు.భవ్య బిష్ణోయ్ తెలివైన వాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని మెహ్రీన్ అన్నారు.స్టడీస్, స్పోర్ట్స్ లో కూడా అతను బెస్ట్ అని మెహ్రీన్ అన్నారు.మెహ్రీన్ కు కట్నంకు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అత్తింటి ఫ్యామిలీ వాళ్లు కట్నం తీసుకునే ఆలోచన ఉన్నవాళ్లు కాదని మా కుటుంబం కట్నం ఇవ్వాలనే ఆలోచన ఉన్న కుటుంబం కాదని ఆమె అన్నారు.భవ్య బిష్ణోయ్ కుటుంబం చాలా హుందాగా వ్యవహరిస్తారని మంచి మనస్సు ఉన్న ఫ్యామిలీ అని మెహ్రీన్ చెప్పుకొచ్చారు.

శీతాకాలంలో వివాహం జరగవచ్చని మెహ్రీన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube