ఎన్టీఆర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారని కంప్లైంట్ చేస్తున్న హీరోయిన్  

Actress Meera Chopra Jr Ntr Fans Troll - Telugu Actress Meera Chopra Fires On Jr Ntr Fans, Jr Ntr, Nandamuri Fans, Social Media Troll, Tarak, Tollywood

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యాన్స్ వార్ ఎక్కువైపోయింది.ఒకప్పుడు సినిమా థియేటర్స్ వద్ద గొడవ పడే స్టార్ హీరోల అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

 Actress Meera Chopra Jr Ntr Fans Troll

ఆ గొడవలు హీరోలని సైతం బూతులు తిట్టుకునేంత వరకు వెళ్ళిపోతున్నాయి.హీరోలపై అసభ్యకరమైన మీమ్స్ తయారు చేసి ట్రోల్ చేయడం ఎక్కువ అయిపోతుంది.

అదే సమయంలో ఎవరైనా ఇతర సెలబ్రిటీలు ఒక హీరో గురించి గొప్పగా మాట్లాడి ఇంకో హీరో గురించి స్పందించకపోయినా వారిని విపరీతంగా ట్రోల్ చేస్తూ బూతులు తిడుతూ టార్చర్ చేస్తున్నారు.ఒక్కోసారి ఈ వేధింపులు శృతి మించి కుటుంబ సభ్యులని దూషించే వరకు వస్తున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారని కంప్లైంట్ చేస్తున్న హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనని వేధిస్తున్నారని హీరోయిన్ మీరా చోప్రా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.దీనిపై స్వయంగా ఎన్టీఆర్ స్పందించాలని ఆశిస్తున్నట్టు ఆమె కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్ అభిమానులు తనను వేశ్య, పోర్న్‌ స్టార్‌ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదని మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పడం వల్లే ఇలా జరిగిందని కామెంట్ చేశారు.

ఎన్టీఆర్ అభిమానులు తన తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని వాపోయింది.ఇటువంటి అభిమానులతో సక్సెస్ సాధించినట్టు ఎన్టీఆర్ భావిస్తున్నారా అని ప్రశ్నించింది.తన ట్వీట్ పట్ల ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నానని మీరా చోప్రా వ్యాఖ్యానించింది.సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉండగా తాను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని, మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పింది.

దీంతో ఆమెపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా అసభ్యకరమైన సందేశాలతో ట్రోల్ చేస్తున్నారు.మరి ఆమె అభ్యర్ధనపై ఎన్టీఆర్ స్పందిస్తాడో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Meera Chopra Jr Ntr Fans Troll Related Telugu News,Photos/Pics,Images..

footer-test