హాలిడే వెకేషన్ లో నటి మీనా... వైరల్ అవుతున్న ఫోటోలు?

సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటి తరం కథానాయకి మీనా గురించి అందరికీ సుపరిచితమే.హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.

 Actress Meena On Holiday Vacation Photos Viral Details, Actress Meena,holiday Va-TeluguStop.com

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలకు కమిట్ అయ్యి ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె జీవితంలో విషాద సంఘటన నెలకొన్న విషయం మనకు తెలిసిందే.మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

భర్త మరణంతో శోకసంద్రంలోకి వెళ్లిపోయిన మీనాకు అండగా ఎంతోమంది స్నేహితులు ధైర్యం చెబుతూ తనని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు.తన భర్త మరణించిన తర్వాత తన స్నేహితులు తరచు తన ఇంటికి వెళ్తూ తనతో సమయం గడిపి ఇప్పుడిప్పుడే తనని సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు.

 Actress Meena On Holiday Vacation Photos Viral Details, Actress Meena,holiday Va-TeluguStop.com

ఇకపోతే కొద్ది రోజుల క్రితం హీరోయిన్స్ సంఘవి రాధిక రంభ వంటి పలువురు హీరోయిన్లు ఈమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరిపించారు.

Telugu Actress Meena, Meena, Holiday, Meena Holiday, Renuka Praveen, Stylishreju

తాజాగా మీనా తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇలా భర్త మరణం తర్వాత మొదటిసారి హాలిడే వెకేషన్ వెళ్ళినటువంటి మీనా ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నేటిజెన్లు మీనా తన భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుందని తనని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube