మద్యం లేక నిద్ర మాత్రలు మింగిన నటి కుమారుడు

ఇండియాలో ఎంతో మంది మద్యానికి బానిసలుగా మారిపోయారు.రోజు మద్యం తాగనిదే వారికి నిద్ర పట్టదు.

 Actress Manorama's Son Bhoopathi In Hospital After Consuming Sleeping Pills, Kol-TeluguStop.com

ఈ మద్యం వ్యాపారులకి కోట్లు తెచ్చిపెడుతున్న.సామాన్య, మధ్యతరగతి కాపురాలు కూలిపోతున్నాయి.

ఈ మద్యం వలన ఎన్నో అనార్ధాలు జరుగుతున్నాయి.అయితే ఈ లాక్ డౌన్ సమయంలో మద్యం దొరకకపోవడం వలన చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మద్యానికి బానిసలుగా మారిన వారు అది ఒక్కసారిగా దొరకకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పిచ్చివాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు.

ఈ నేపధ్యంలో మద్యం డోర్ డెలివరీ చేయాలనే డిమాండ్ లు పెరుగుతున్నాయి.ఇక మద్యపానంకి బానిసలుగా మారిన వారిలో సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు.

అయితే సెలబ్రిటీలు ముందుగానే వారి ఇంట్లో ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు.కొంత మందికి ఆ పరిస్థితి ఉండదు.ఈ క్రమంలో మద్యం దొరక్క ఓ సీనియర్ నటి కుమారుడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగారు.దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు.

బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మద్యానికి అలవాటు పడిన వారిలోచాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది.

లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్‌తో వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్యం హోం డెలివరీ ప్రతిపాదన తెచ్చింది.

కొన్ని రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్‌ కూడా ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు.కొంత సమయం పాటు మద్యం దుకాణాలను తెరవాలని కోరారు.

లాక్ డౌన్ కొనసాగిస్తున్న వేళ ఇంకా ఎంత మంది మద్యం దొరకక ఇలా పిచ్చివాళ్ళుగా మారి ఆత్మహత్యలు చేసుకుంటారో అనేది భయపెట్టే అంశంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube