చివరి రోజుల్లో దుర్భరమైన జీవితం గడిపిన లెజెండరీ లేడీ కమెడియన్

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ కొందరి జీవితాలు మాత్రం సినిమాలకే అంకితం అయిపోతాయి.అలాంటి వాళ్లలో ఎన్టీఆర్ నాగేశ్వరరావు వంటి వారు అప్పట్లో వాళ్లు ఏ సినిమా చేసినా అన్ని సినిమాల్లో అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకునేవారు అన్నింటిపైన డైరెక్టర్ శ్రద్ధ తీసుకున్నప్పటికీ వాళ్లు కూడా చాలా శ్రద్ధతో అన్నీ బాగున్నాయా లేదా ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా అని అన్ని వాళ్ళు చూసుకునేవారు.

 Actress Manorama Real Life Story, Manorama, Rajinikanth, Chirenjeevi, Ntr, Nages-TeluguStop.com

అందుకే అప్పట్లో ఏ హీరోలకి లేని హిట్ సినిమాలు ఈ హీరోలకు మాత్రమే ఉండేవి. అందుకే అప్పుడు వీళ్లు పౌరాణికం, చారిత్రకం, కమర్షియల్ లాంటి అన్ని జోనర్ సినిమాలని చేస్తూ వచ్చారు.

వీళ్ళ తర్వాత వచ్చిన చిరంజీవి కూడా చాలా హిట్ సినిమాల్లో నటించారు.అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమాకు సంబంధించిన ప్రతి పని దగ్గరుండి చూసుకుంటాడు.

ఇప్పటికి రజినీకాంత్ సినిమా చేస్తుంటే ఆ సినిమా ప్రొడక్షన్ లో పనిచేసే ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాకా అందరి పేర్లు తెలుసుకొని వాళ్ళని వాళ్ళ పేరుతో పిలుస్తాడు అంటే అతను చేసే పని పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉంటే అంత బాగా చూసుకుంటాడు అందుకే ఎక్కువ పని పట్ల ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్లు ఆ రంగంలో రాణిస్తారు.అయితే తమిళంలో రజినీకాంత్ కి ఇష్టమైన మనిషి ఎవరంటే అంటే ఆయన కళభవన్ మనోరమ అని చెప్తారు.

ఈ పేరు విన్నా కూడా చాలా మందికి ఈవిడ తెలియక పోవచ్చు.కానీ ఆమెను చూస్తే గుర్తుపట్టని వారు ఉండరు.తమిళ్ లో రెండు దశాబ్దాల పాటు ఆమె నటించని తమిళ్ సినిమా అనేది లేదు.ఏ సినిమా అయిన సరే ఆ సినిమా లో ఆమెకి ఏ క్యారెక్టర్ లేకపోయినా దర్శక నిర్మాతలు రచయితలతో ఆమె కోసం ఒక పాత్రను రాయించుకునేవారు అంతటి గుర్తింపు పొందిన ఆమె మొదట్లో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కామెడీ వైపు మొగ్గు చూపింది.

అప్పటి కామెడీ ఆర్టిస్ట్ అయిన నగేష్ తో కలిసి చాలా సినిమాల్లో నటించి విచిత్రమైన హావభావాల తో జనాలని అలరించేది.ఒకానొక టైంలో ఆమె డేట్స్ ఉంటేనే గాని హీరోలు డేట్స్ ఇవ్వము అని అన్నారు అంటే ఆమె తమిళంలో ఎంత పాపులర్ అయింది మనం చెప్పాల్సిన పని లేదు.

తమిళ్ లో వచ్చిన జెంటిల్మెన్, భారతీయుడు లాంటి చాలా సినిమాల్లో యాక్టింగ్ చేసింది తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది.కామెడీగానే కాదు సెంటిమెంట్ కూడా బాగా పండిస్తుంది.

తమిళ్ లో నలుగురు సీఎంలతో కలిసి పనిచేసిన ఏకైక ఆర్టిస్ట్ మనోరమ.ఈవిడ తెలుగులో అరుంధతి సినిమాలో కూడా నటించింది.

Telugu Chirenjeevi, Manorama, Comidian, Nageswarao, Rajinikanth-Telugu Stop Excl

అయితే తెలుగులో బ్రహ్మానందం పెద్ద కామెడీ ఆర్టిస్టు గా గుర్తింపు పొందిన విషయం మన అందరికీ తెలిసిందే.అలానే ఈవిడ కూడా తమిళంలో చాలా పెద్ద కామెడీ ఆర్టిస్ట్ ఆవిడ చేసిన కామెడీ కి నవ్వని మనిషి అంటూ ఉండడు.చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన మనోరమని రజనీకాంత్ సైతం అమ్మ అమ్మ చాలా గౌరవంగా పిలుస్తాడు.అరుంధతి సినిమాలో ఆవిడ చేసిన పాత్ర వేరే వాళ్ళతో చేపిద్దాం అని కోడి రామకృష్ణ అంటే వద్దు ఆ క్యారెక్టర్ కి మనోరమ గారు మాత్రమే న్యాయం చేయగలరని చెప్పి మరి ఒప్పించి ఆమెతో చేపించాడు ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి.

వయసు పెరిగిపోవడంతో సినిమాలు చేయడం తగ్గించింది.  తర్వాత ఆవిడ అనారోగ్యానికి గురి కావడం వల్ల ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది చివరగా 2015లో కన్నుమూశారు.

ఈవిడ చివరి రోజులు మాత్రం అత్యంత దుర్భరంగా సాగాయి.మనోరమ ఆస్థి కోసం ఆమె మనవరాలి కేసు వేసి కోర్ట్ కి లాగింది.ఆలా చివరి దశలో కోర్ట్ ల చుట్టూ తిరిగింది మనోరమ.  కెరీర్ మొత్తంలో ఒక చిన్న వివాదం కూడా లేకుండా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు సాధించారు.

ముందు అనుకున్నట్టుగా ఎన్టీఆర్,నాగేశ్వరరావు,రజినీకాంత్ లాంటి వారికి సినిమా మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో మనోరమ గారికి కూడా అంతే ప్రేమ ఉంటుంది వీళ్లంతా సినిమా కోసమే పుట్టిన గొప్ప మనుషులు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube