తండ్రిపై ప్రేమను చాటుకున్న మంచు లక్ష్మి.. ఏం చేశారంటే..?

వందల సంఖ్యలో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మోహన్ బాబు.నేడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు.

 Actress Manchu Laxmi Emotional Post About Father In Twitter, Actress Manchu Laxm-TeluguStop.com

జయాపజయాలకు అతీతంగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు వారసులు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు.మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వాళ్లు సత్తా చాటుతున్నారు.

తండ్రి పుట్టినరోజు కావడంతో మంచు లక్ష్మి తన లైఫ్ లో గ్రేట్ పర్సన్ అయిన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.తండ్రిపై ఉన్న లవ్ ను ఎక్స్ ప్రెస్ చేయడానికి సరిపోవని.

తన స్ట్రెంత్, మోటివేషన్ అన్నీ తండ్రేనని మంచు లక్ష్మి అన్నారు.ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి తండ్రే కారణమని.

నాన్న లేకుండా నేను లేను అంటూ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా ద్వారా తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పారు.

మోహన్ బాబు మరో కొడుకు మంచు విష్ణు తండ్రి పుట్టినరోజు కానుకగా మోసగాళ్లు సినిమాను నేడు విడుదల చేయగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాల తర్వాత సరైన సక్సెస్ లేని విష్ణు ఈ సినిమాల తరువాత మోసగాళ్లు మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మరోవైపు మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్నారు.

మోహన్ బాబు ఈ సినిమా కథనంలో పాలు పంచుకున్నారని తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.చాలాకాలం తర్వాత మోహన్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube