ఆ హీరోకు పెళ్లైందని తెగ ఏడ్చేసిన మంచు లక్ష్మి..!  

మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా, సింగర్ గా తనకంటూ పేరు, గుర్తింపును సంపాదించుకున్నారు మంచు లక్ష్మి.నటించింది తక్కువ సినిమాలే అయినా మంచు లక్ష్మి నటనకు నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు వచ్చాయి.

TeluguStop.com - Actress Manchu Lakshmi Reveals Her Crush On Aamir Khan

అయితే తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను, అభిరుచులను, ఇతర విశేషాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ఒక హీరోకు పెళ్లైందని తాను తెగ ఏడ్చేశానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

జాతీయ మీడియాకు మంచు లక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున, అమీర్ ఖాన్ గురించి మంచు లక్ష్మీ మాట్లాడారు.తాను అమీర్ ఖాన్ కు పెద్ద ఫ్యాన్ అని.అమీర్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలో తాను ఎంతో బాధ పడ్డానని వెల్లడించారు.అమీర్ ఖాన్ ఎంచుకున్న పాత్రల్లో అద్భుతంగా నటిస్తాడని ఆయన సినిమాలను ఎంపిక చేసుకునే విధానం బాగుంటుందని తెలిపారు.

TeluguStop.com - ఆ హీరోకు పెళ్లైందని తెగ ఏడ్చేసిన మంచు లక్ష్మి..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ లో తనకు అమీర్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని మంచు లక్ష్మి పేర్కొన్నారు.టాలీవుడ్ లో మాత్రం అక్కినేని నాగార్జునకు తాను వీరాభిమానినని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.నాగార్జున నటన ఎంతో బాగుంటుందని మంచు లక్ష్మి అన్నారు.అమీర్ ఖాన్ పై మంచు లక్ష్మీ ఇష్టాన్ని వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు.గతంలో కూడా పలు ఇంటర్వ్యూల్లో అమీర్ ఖాన్ పై ఉన్న ఇష్టాన్ని మంచు లక్ష్మి బయటపెట్టారు.

మంచు లక్ష్మి అమీర్ ఖాన్, నాగార్జున గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోవైపు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ, సినిమాలు, టీవీ షోలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో మంచు లక్ష్మికి 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

#ActressManchu #Manchu Laxmi #Manchu Lakshmi #HeroNagarjuna #ManchuLakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు