కొత్త కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. కారు ధర తెలిస్తే మతిపోవాల్సిందే?

మార్కెట్ లోకి వచ్చిన లగ్జరీ కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు కొందరు సెలబ్రెటీలు.అలా తమ క్రేజ్‌ను కొనసాగిస్తూ.

 Actress Mamta Mohandas Latest Photoshoto With His Luxury Car-TeluguStop.com

తమకు కావల్సిన వాహనాన్ని కొనేందుకు ఎంత ఖర్చైనా చేసేందుకు రెడీ ఉంటారు.దానికి తగ్గట్టుగానే ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు.

ఇది కేవలం హీరోలతోనే పరిమితం కాకుండా.ప్రముఖ తారలు సైతం ఆ దారినే ఎంచుకుంటూ తామేంటో నిరూపిస్తున్నారు.

 Actress Mamta Mohandas Latest Photoshoto With His Luxury Car-కొత్త కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. కారు ధర తెలిస్తే మతిపోవాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వారి జాబితాలో ప్రముఖ మలయాళీ నటి ‘మమతా మోహన్ దాస్’ కూడా ముందుంటుంది.

ఒకప్పుడు అగ్ర కథానాయికలకు గట్టి పోటీని ఇచ్చిన నటిమణులలో మమతా మోహన్ దాస్ ఒకరు.

మంచి పొజీషన్లోకి వస్తున్న సమయంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడడం చాలా బాధాకరం.అనంతరం పోరాడి గెలిచింది.మమతా మోహన్‌దాస్‌ అనగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ చిత్రంలో అబ్బయా.ఓ అబ్బయా.

అంటూ తెగ సందడి చేసిన క్యారెక్టరే.ఎలాంటి పాత్ర చేసినా ఆ పాత్రకు న్యాయం చేస్తూ… అప్పట్లోనే మంచి ఇమేజ‌్‌ను కూడగట్టుకుంది మమతా మోహన్‌దాస్.

అంతేకాకుండా ఈమె కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మంచి గుర్తింపు అందుకుంది.

ఇదిలా ఉండగా.2011లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సిద్దమవుతున్న సమయంలోనే భర్తతో విడాకులు కూడా తీసుకుంది.

Telugu Luxury Car, Mamta Mohan Das Luxury Car, Mamta Mohandas, Mamta Mohandas Latest Photoshoot, Ntr Heroine, Porsche 911, Tollywood, Yamadongs-Movie

ఒంటరిగానే అమెరికాకు వెళ్లి చికిత్స చేసుకుని మహమ్మారిని జయించింది.అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది మ‌మ‌తా మోహ‌న్ దాస్.తాజాగా త‌న‌కు న‌చ్చిన ‘పోర్ష్‌ 911’ తో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.1.84 కోట్లు.ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ కి కూడా ఉంది.

ప్రస్తుతం ఈమె తన కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

#Mamta Mohandas #MamtaMohan #Yamadongs #Mamta Mohandas #Porsche

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు