హీరోయిన్ పై కత్తితో దాడి చేసిన నిర్మాత  

Actress Malvi Malhotra stabbed thrice by producer, Bollywood, Celebrities, Telugu Heroine, Yogesh Kumar, Mumbai - Telugu Actress Malvi Malhotra, Actress Malvi Malhotra Stabbed Thrice By Producer, Bollywood, Celebrities, Heroin Kumari 18+ Movie, Mumbai, Telugu Heroine, Tv Show, Yogesh Kumar

ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళపై పైశాచిక దాడులు ఎక్కువ అయ్యాయి.ప్రేమని నిరాకరించింది అనే కక్షతో కిరాతకంగా చంపడానికి కూడా మగాళ్లు వెనుకాడటం లేదు.

TeluguStop.com - Actress Malvi Malhotra Stabbed Thrice By Producer

అలాగే అభంశుభం తెలియని అమ్మాయిల మీద మూకుమ్మడిగా దాడి చేస్తూ సామూహిక అత్యాచారాలకి పాల్పడుతున్నారు.తరువాత మరింత తెగించి చంపేస్తున్నారు.

ఇలాంటి వారికి ఎన్ని శిక్షలు పడినా కూడా ఈ దురాగతాలు ఆగడం లేదు.కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఓ అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని కిరాతకంగా ఒక యువకుడు చంపేశాడు.

TeluguStop.com - హీరోయిన్ పై కత్తితో దాడి చేసిన నిర్మాత-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి ఘటనలు తరుచుగా ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం.తాజాగా ఓ వర్ధమాన హీరోయిన్ ని కూడా ఓ నిర్మాత ఇలాగే కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స అందుకుంటుంది.ఆమె పరిస్థితి విషమంగానే ఉంది.

సినీనటి, టీవీ షో ప్రజెంటర్ గా రాణిస్తున్న మాల్వీ మల్హోత్రా ఒక సినిమా కోసం గత ఏడాది యోగేశ్ కుమార్ ని కలిసింది ఇటీవలే ఆమె వద్ద యోగేష్ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు.అయితే అతని ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది.

దీంతో అప్పటి నుంచి కక్ష పెంచుకున్న అతను తరుచుగా మాల్వీని వేధిస్తున్నాడు.ఆమె తన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆడీ కారులో యోగేశ్ వచ్చాడు.

ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.అతనితో మాట్లాడేందుకు మాల్వీ నిరాకరించడంతో కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు.

ఆమె కడుపు, కుడిచేతి మణికట్టు, ఎడమ చేతికి గాయాలయ్యాయి.జనాలు అక్కడ పోగవడంతో తన కారులో పరారయ్యాడు.

మాల్వీ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి యోగేష్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఘటనకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ దొరకడంతో దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగులో ఆమె హీరోయిన్ కుమారి 18+ అనే చిత్రంలో నటించింది.హిందీ, మలయాళం చిత్రాల్లో కూడా నటిస్తుంది.

#Yogesh Kumar #Celebrities #TV Show #HeroinKumari #ActressMalvi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Malvi Malhotra Stabbed Thrice By Producer Related Telugu News,Photos/Pics,Images..