ఆ రీజన్ వల్లే నాకు పొగరు అని అందరూ అనుకునేవారు.. మహేశ్వరి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి మహేశ్వరి తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.పెళ్లి సినిమా మహేశ్వరికి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

 Actress Maheshwari Interesting Comments About Cine Career , Cine Career , Interesting Comments, Maheshwari , Shocking Facts-TeluguStop.com

శ్రీదేవి అక్క కూతురు కావడంతో మహేశ్వరికి సులభంగానే సినిమా రంగంలో ఆఫర్లు వచ్చాయి.తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలలో నటించి మహేశ్వరి మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

మహేశ్వరి సినిమాలలో ఆఫర్లు తగ్గిన తర్వాత పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.ఆ తర్వాత మహేశ్వరి సొంతంగా ఒక ఫ్యాషన్ స్టోర్ ను మొదలుపెట్టారు.

 Actress Maheshwari Interesting Comments About Cine Career , Cine Career , Interesting Comments, Maheshwari , Shocking Facts-ఆ రీజన్ వల్లే నాకు పొగరు అని అందరూ అనుకునేవారు.. మహేశ్వరి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీదేవి చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభం కావడం గమనార్హం.తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన మహేశ్వరి ఈ షోలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాను శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి పొగరని అనుకునేవాళ్లని మహేశ్వరి కామెంట్లు చేశారు.

నేను సాధారణంగానే సైలెంట్ గా ఉంటానని అలా సైలెంట్ గా ఉండటాన్ని కొంతమంది పొగరు అని అనుకుంటారని మహేశ్వరి చెప్పుకొచ్చారు.

శ్రీదేవి తనకు వరుసకు పిన్ని అయినా అక్క అని పిలిచే దానినని మహేశ్వరి కామెంట్లు చేశారు.శ్రీదేవి లేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని మహేశ్వరి అన్నారు.

ఇంటర్ లో కాకికి రెండు జడలు వేసినట్టు తాను ఉండే దానినని మహేశ్వరి అన్నారు.గులాబి సినిమా ఆ స్థాయిలో హిట్ అవుతుందని అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.

వడ్డే నవీన్ తో పెళ్లి, మా బాలాజీ సినిమాలలో కలిసి నటించానని మహేశ్వరి వెల్లడించారు.

16 సంవత్సరాల వయస్సులోనే మహేశ్వరి నటిగా మారారు.కరుతమ్మ అనే తమిళ సినిమాతో మహేశ్వరి నటిగా సినీ కేరీర్ ను మొదలుపెట్టారు.అమ్మాయి కాపురం అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మహేశ్వరి పరిచయమయ్యారు.

ప్రస్తుతం మహేశ్వరి సినిమాలకు దూరంగా ఉండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube