తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చా.. నటి కీలక వ్యాఖ్యలు..?

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సీరియళ్లలో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ మధు కృష్ణన్ నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.మధుకృష్ణన్ దాదాపు 1300 స్టేజ్ షోలు చేయడం గమనార్హం.

 Actress Madhu Krishnan Remembers Her Childhood Gets Emotional-TeluguStop.com

స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్లలో ప్రసారమవుతున్న సీరియళ్లలో నటిగా మధుకృష్ణన్ నటిగా సత్తా చాటుతున్నారు.తాజాగా ఒక షోకు మధుకృష్ణన్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ షోకు హాజరైన సమయంలో మధుకృష్ణన్ తను అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.తనకు పది సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే తండ్రి దూరమయ్యారని ఆమె చెప్పారు.

 Actress Madhu Krishnan Remembers Her Childhood Gets Emotional-తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చా.. నటి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పది సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో నాన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని ఆమె వెల్లడించారు.నాన్న చనిపోయిన తరువాత అమ్మమ్మ, తాతయ్య అమ్మను తీసుకొని వెళితే నాన్నమ్మ, తాతయ్య తన బాధ్యతను తీసుకున్నారని ఆమె చెప్పారు.

Telugu Childhood Memories, Gets Emotional, Madhukrishnan, Movie Offers, Serial-Movie

ఆ సమయంలో తాను తాతయ్య కాళ్లు పట్టుకొని ఏడ్చానని నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తాతయ్య, అమ్మమ్మ తనను ఎంతో కష్టపడి పెంచారని ఆమె తెలిపారు.తనకు పెళ్లి చేయాలని అనుకున్న సమయంలో తాతయ్య చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని ఆమె చెప్పారు.ఆ తరువాత తాను స్టేజ్ షోలు చేసుకుంటూ చదువుకున్నానని వెల్లడించారు.తర్వాత యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి బీటెక్ చేశానని మధుకృష్ణన్ తెలిపారు.

ఎంటెక్ కూడా చదవాలని అనుకున్నానని కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే తన ఎంటెక్ చదువు ఆగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.కష్టాలు ఎదురైతే ధైర్యంతో ఎదుర్కొన్నానని ఒంటరి అనే భావన తనకు ఎప్పుడూ కలగలేదని ఆమె తెలిపారు.

ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం మధుకృష్ణన్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

#Madhukrishnan #Serial #Gets Emotional

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు