సామ్, చైతూ విడాకులు.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకండి: ఖుష్బు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా సమంత నాగచైతన్య గురించి పెద్ద ఎత్తున చర్చలు వినపడుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో స్వీట్ కపుల్ గా ఉండే ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు నిజమని నాగచైతన్య స్పందించడంతో ఒక్కసారిగా అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు షాక్ కి గురయ్యారు.10 సంవత్సరాల వీరి బంధంలో ఏడేళ్ల స్నేహం చేసి నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడిపిన వీరు కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

 Samantha, Naga Chaitanya, Kushboo , Divorce Matter,latest News-TeluguStop.com

ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం సమంత పలు సినిమాలలో బోల్డ్ గా కనిపించడమే కారణమని కొందరు భావించగా మరికొందరు తనకు ఎవరితోనూ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయం పై పలువురు స్పందిస్తూ తమదైన శైలిలో ట్వీట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయంపై సీనియర్ నటి కుష్బూ స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా కుష్బూ స్పందిస్తూ… సమంత చైతన్య విడాకుల విషయం పై నెటిజన్లు చేసే కామెంట్లపై ఆమె ఎంతో సీరియస్ అయ్యారు.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు అంటే అందుకు గల కారణం వారికి మాత్రమే తెలుసు.వారి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు జరిగాయో వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి తెలియదు.వారి వ్యక్తిగత విషయాల కారణంగా ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మనం ఆ నిర్ణయాన్ని గౌరవించాలి కానీ లేనిపోని వార్తలను సృష్టించకండి అంటూ ఈ సందర్భంగా ఖుష్బూ సమంత నాగ చైతన్య విడాకుల విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube