పాపం కుష్బు.. ఆశలన్నీ అడియాశాలయ్యాయిగా!

ప్రముఖ సినీనటి కుష్బూ సినిమాల్లోనే కాకుండా రాజకీయ పరంగా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది.ఈమె బీజేపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

 Actress Kushboo Lost Chance To Contest From Chepauk And Triplicane Assembly Cons-TeluguStop.com

ఇదివరకు ఈమె డీఎంకే, కాంగ్రెస్ ఎన్నికల లో పోటీకి అవకాశం రానందున బీజేపీలో అవకాశం ఉంటుందని చేరారు.పిక్ ఆమె చేపాక్కం- ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తానన్న వార్తలు వినిపించాయి.

ఇక ఇదే అవకాశంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి నియోజకవర్గంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది.

ఇక ఈ నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాన్ని పలురకాల సెట్టింగులతో ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేయించింది.

ఇక అందులో కొన్ని రకాల వస్తువులతో ఎన్నికల పనులను మరింత వేగంగా పెంచింది.ఇక ఆ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళింది.ఇలా ఆరు నెలలు వారి గురించి చేసిన సేవ మొత్తం వృథా అయింది.

Telugu Anna Dmk, Assembly, Chepauk, Contest, Gowthami Senior, Kushboo, Chance, N

కారణం ఆ నియోజకవర్గం సీటును అన్నాడీఎంకే నుంచి రావడంతో బీజేపీ నిరుత్సాహపడింది.ఈ విషయం గురించి ఆ నియోజక ప్రజలు కూడా కుష్బూ ఆశ అడియాశలు కావడంతో వాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.ఇలాగే మరో అభ్యర్థి గౌతమి సీనియర్, గాయత్రి రఘురాం, నమిత ప్రస్తుతం కుష్బూ వంటి వాళ్లు బీజేపీ పార్టీలో చేరగా కుష్బూను చేపాక్కం ఇన్ ఛార్జ్ గా, గౌతమిని రాజ పాళయం ఇన్ చార్జ్ గా ప్రకటించారు.

ఇక గౌతమి ఇటునుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని వార్తలు రాగా.ఇక్కడ కూడా ఈ సీటును అన్నా డీఎంకే నుంచి రాబట్టుకోవడం తో మళ్లీ నిరాశ చెందారు.

ఇక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ విషయం గురించి జీర్ణించుకోలేక పోయారు.

ఈ విషయం గురించి తాజాగా గౌతమి ట్వీట్ చేయగా.

ఐదు నెలలుగా రాజ పాళయం లో ప్రతి ఒక్క ఇంట్లో తనను ఓ బిడ్డగా, ఓ సోదరిగా చూసుకున్నారంటూ వారికి కృతజ్ఞతలు అంటూ అలాగే మైలాపూర్ నుంచి బీజేపీ సీనియర్ కరు నాగరాజన్, తిరుత్తణి నుంచి సీనియర్ చక్రవర్తి నాయుడు పోటీ చేయవచ్చన్న వార్త రాగా అక్కడ కూడా అన్నా డీఎంకే అభ్యర్థులు పోటీకి దిగడం వల్ల నిరాశ చెందారని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube