ఆమె శ్రీరెడ్డిని కుక్కతో పోల్చింది.. ఈమెకు మండ్డింది     2018-07-22   11:36:28  IST  Ramesh Palla

శ్రీరెడ్డి తెలుగు మరియు తమిళ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమెపై కూడా కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానం చెబుతూ శ్రీరెడ్డి మరింతగా పబ్లిసిటీ దక్కించుకుంటూ ఉంది. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమా ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తున్న శ్రీరెడ్డి తాజాగా తమిళ సినీ ప్రముఖులపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ, వారు తనను మోసం చేసిన విధానంను పూస గుచ్చినట్లుగా చెప్పుకొచ్చింది.

తమిళ సినీ పరిశ్రమకు చెందిన మురుగదాస్‌, లారెన్స్‌ ఇంకా శ్రీకాంత్‌, దర్శకుడు సుందర్‌ సి వంటి వారిపై శ్రీరెడ్డి విమర్శలు చేసింది. ఈ సమయంలోనే తమిళ సినీ పరిశ్రమకు చెందిన వారు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాల్‌ మరియు కార్తీలు సాక్ష్యాధారాలతో మాట్లాడాలని, లేదంటే మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తన భర్తపై విమర్శలు చేసినందుకు ఖుష్బు తీవ్ర స్థాయిలో శ్రీరెడ్డిపై విరుచుకు పడటం జరిగింది. శ్రీరెడ్డివి అర్థం పర్థం లేని విమర్శలు అంటూ ఖుష్బు ఆరోపించింది.

Actress Kushboo Call Sri Reddy DOG-

Actress Kushboo Call Sri Reddy DOG

తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఖుష్బు మీడియాతో మాట్లాడుతూ కుక్కతో శ్రీరెడ్డిని పోల్చడం జరిగింది. తన భర్త గురించి ఆమె చేరిన ఆరోపణలను కొట్టి పారేసింది. తనకు అంతా తెలుసు అని, ఆయన గురించి ఎవరో వాగితే తాను పట్టించుకోను అంటూ ఖుష్బు చెప్పుకొచ్చింది. తమిళనాట ఖుష్బు వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మరో వైపు శ్రీరెడ్డి కూడా తనపై ఖుష్బు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ రిప్లై ఇచ్చింది.

సోషల్‌ మీడియాలో ఒక వీడియోను శ్రీరెడ్డి పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. మీరు ఒక మహిళగా మాట్లాడితే గౌరవిస్తాను, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం మీకు మంచిది. నిర్మాతగా మీరు సినిమాలు చేశారు, మేము పడుతున్న బాధలు మీకు తెలిసి ఉండక పోవచ్చు. కోఆర్డినేటర్స్‌ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో మాకు మాత్రమే తెలుసు. సినిమాల్లో అవకాశాలు ఇచ్చి నార్త్‌ అమ్మాయిలను ఇంట్లో ఉంచుకున్న కల్చర్‌ మీది. మీరు నా గురించి మాట్లాడుతున్నారా అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న సమయంలో ఖుష్బు ఈ విషయమై సరైన రీతిలో స్పందించక పోగా తనను విమర్శించడం ఏంటని శ్రీరెడ్డి ప్రశ్నిస్తుంది.