గత ఏడాది బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన.ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.
ఇక గత ఏడాది నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా మరో అద్భుతమైన హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ ఏడాది మొదట్లోనే నాగ చైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రం ద్వారా మరో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కృతి శెట్టి నటించిన మొదటి చిత్రం ఉప్పెన సినిమా విడుదల అయి ఒక సంవత్సరం పూర్తి కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ విడుదలైంది. ఈ సందర్భంగా కృతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…జీవితంలో ప్రతి ఒక్కరికి 2 పుట్టిన రోజులు ఉంటే ఒకటి మనం పుట్టిన రోజున జరుపుకోగా రెండవ పుట్టిన రోజున మనం కెరీర్ లో ఏం చేయాలని ఎంచుకుంటామో ఆరోజే రెండవ పుట్టినరోజు అంటూ తెలియజేశారు.
ఈ క్రమంలోనే గత ఏడాది సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాను కనుక ఇది నాకు రెండో పుట్టినరోజు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నేను ఎంతో ఇష్టపడి ఈ రంగంలోకి రావడం ఓక ఎత్తు అయితే ఇండస్ట్రీలో నన్ను ఎంతగానో ఆదరించి నాకు మీరందరూ మద్దతు తెలపడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఇదే నన్ను జీవితంలో ముందుకు తీసుకెళుతోంది.నా ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తు ఉండేలా చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు.
ఇదే ఉత్సాహంతో మరిన్ని మంచి పాత్రల ద్వారా మీ ముందుకు వస్తున్నాను థాంక్యూ ఆల్ అంటూ బేబమ్మ తన సినీ ప్రస్థానం గురించి తెలియజేశారు.
ఈ విధంగా మొదటి సినిమా ఉప్పెన తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోగా ఈ సినిమా విడుదలైన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం ఈమె సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అదేవిధంగా మెగా డాటర్ సుస్మిత నిర్మాణంలో లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.