ఇండస్ట్రీలో ఆ వివక్ష ఉందన్న ప్రభాస్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల పారితోషికాలు 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటే హీరోయిన్ల పారితోషికాలు మాత్రం ఎక్కువగా పెరగడం లేదు.వరుసగా హిట్లు ఉంటే మాత్రమే హీరోయిన్లకు భారీ పారితోషికం ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

 Actress Kriti Sanon Discrimination In Rewards-TeluguStop.com

గతంలో పలు సందర్భంలో పారితోషికాల గురించి మాట్లాడుతూ హీరోయిన్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కు జోడీగ నటిస్తున్న కృతిసనన్ పారితోషికాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actress Kriti Sanon Discrimination In Rewards-ఇండస్ట్రీలో ఆ వివక్ష ఉందన్న ప్రభాస్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కృతిసనన్ నటించిన మిమి మూవీ ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే.పారితోషికాలకు సంబంధించిన ధోరణిలో మార్పు రావాలని కృతిసనన్ కోరుకుంటున్నారు.బాలీవుడ్ లో పారితోషికాల విషయంలో ఉన్న వ్యత్యాసం గురించి మాట్లాడిన కృతిసనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu @kritisanon, Bollywood, Discrimination, Heroines Remuneration Aadipurush, Huge Remuneration, Kriti Sanon Comments, Lady Oriented Movies, Mimi Movie, Prabhas, Rewards-Movie

హీరోయిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలను లేడీ ఓరియెంటెడ్ సినిమాలని అంటున్నారని అందువల్ల హీరోయిన్లు నటిస్తున్న సినిమాలకు న్యాయం జరగడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.కథ, బడ్జెట్ ను బట్టి హీరోయిన్లు నటించిన సినిమాలను జడ్జ్ చేయాలని కృతిసనన్ సూచనలు చేశారు.అలా చేస్తే మాత్రమే హీరోయిన్లకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కృతిసనన్ అభిప్రాయపడ్డారు.

Telugu @kritisanon, Bollywood, Discrimination, Heroines Remuneration Aadipurush, Huge Remuneration, Kriti Sanon Comments, Lady Oriented Movies, Mimi Movie, Prabhas, Rewards-Movie

కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలకు సమాన స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని అలా అందుకోవడం శుభ పరిణామమని కృతిసనన్ చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే పురుషాధిక్య భావాజాలం పోతుందో అప్పుడే రెమ్యునరేషన్ విషయంలో వివక్ష పోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు పారితోషికాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.హీరోలకు సమానంగా ఉండే పాత్రలను ఎంచుకుంటే మాత్రమే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయవచ్చని కృతిసనన్ చెప్పుకొచ్చారు.

కృతిసనన్ కామెంట్లకు ఇతర హీరోయిన్లు కూడా మద్దతు పలుకుతారేమో చూడాల్సి ఉంది.

#@KritiSanon #LadyOriented #Rewards #KritiSanon #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు