Prabhas Kriti Sanan : ప్రభాస్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నటి కృతి సనన్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం 42 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ ఇంకా ఈయన పెళ్లి గురించి ఏ విధమైనటువంటి గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో తరచూ ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 Actress Kriti Sanan Who Gave Clarity About Her Marriage With Prabhas What Does S-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రభాస్ బాలీవుడ్ నటి కృతి సనన్ తో రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కృతి సనన్ ప్రభాస్ గుండెల్లో ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

ఇకపోతే ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రభాస్ ప్రపోజల్ కి కృతి ఓకే చెప్పిందని, త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని వెల్లడించారు.ఇలా ప్రభాస్ కృతి సనన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Actresskriti, Bollywood, Gave, Prabhas-Movie

ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల పై నటి కృతి సనన్ స్పందిస్తూ.తమ పెళ్లి గురించి వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.ఇక వరుణ్ దావన్ సైతం మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామనే వార్తలను చాలా సరదాగా చెప్పారు అంటూ ఈ సందర్భంగా ఈమె ప్రభాస్ తో రిలేషన్ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.దీంతో ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్టు అయింది.

ఇకపోతే వీరిద్దరూ కలిసి ఆది పురుష్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube