ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన కృతి శెట్టి.. కారణం అదేనా?

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి అనంతరం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న కృతి శెట్టి ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ సరసన ది వారియర్ అనే చిత్రంలో నటించారు.

 Actress Krithi Shetty Got Emotional At Galatta Crown Interview,galatta Crown,actress Krithi Shetty,krithi Shetty Crying,social Media, Krithi Shetty Video,the Warrior,hero Ram-TeluguStop.com

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలకానుంది.

 Actress Krithi Shetty Got Emotional At Galatta Crown Interview,Galatta Crown,Actress Krithi Shetty,Krithi Shetty Crying,Social Media, Krithi Shetty Video,The Warrior,Hero Ram-ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన కృతి శెట్టి.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో తమిళంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కృతి శెట్టి బిహైండ్‌వుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమం మొదలవడానికి ముందు కృతి శెట్టిని ప్రముఖ ఫ్రాంక్ స్టార్స్ అయినటువంటి ఆషిక్‌, సారథిరన్‌ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్ వ్యూలో భాగంగా వీరిద్దరూ ఫ్రాంక్ చేస్తూ ముందుగా తాను ప్రశ్నించాలి అంటే తాను ప్రశ్నించాలని ఇద్దరు పెద్ద ఎత్తున గొడవ పడ్డారు.ఈ విషయం తెలియని కృతి శెట్టి ఒక్కసారిగా కంగారు పడ్డారు.ఇలా వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సారథిరన్‌ ఆషిక్‌ పై ఏకంగా చేయి చేసుకున్నారు.

ఈ గొడవ మొత్తం చూసిన కృతి ఎంతో ఆందోళన చెందగా వెంటనే ఫ్రాంక్ అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా నవ్వారు.అయితే ఇలా ఫ్రాంక్ పేరుతో తీవ్ర ఆందోళనకు గురి చేయడంతో ఎమోషనల్ అయిన కృతి శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎందుకు ఏడ్చారని ఆమెను ప్రశ్నించగా తనకు ఎవరైనా గట్టిగా, కఠినంగా మాట్లాడితే నచ్చదని చెబుతూ బోరున ఏడ్చారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube