గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన కమెడియన్ కోవై సరళ.. దేవుడా అంటూ?

ప్రముఖ లేడీ కమెడియన్లలో ఒకరైన కోవై సరళకు తెలుగులో ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా ప్రేక్షకులు ఆమె కామెడీ టైమింగ్ ను సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 Actress Kovai Sarala New Look Of Sembi Movie Goes Viral In Social Media  , Actre-TeluguStop.com

కొన్ని సినిమాలు సక్సెస్ సాధించడంలో కోవై సరళ పాత్ర ఎంతగానో ఉంది.అయితే ప్రస్తుతం కోవై సరళ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఫోటోలో కోవై సరళను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.కామెడీ క్వీన్ గా పేరు సంపాదించుకున్న కోవై సరళ తలకు క్లాత్ కట్టుకుని చేతిలో బిడ్డను ఎత్తుకుని షాకింగ్ లుక్ లో కనిపించారు.

మొదట ఈ ఫోటోను చూసి షాకైన కోవై సరళ అభిమానులు ఈ ఫోటో సినిమాకు సంబంధించిన పోస్టర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.సెంబి అనే సినిమాలో కోవై సరళ నటిస్తుండగా చాలా కాలం తర్వాత ఆమె సీరియస్ రోల్ లో నటిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.బస్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా తంబి రామయ్య, బాలనటి నీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారని సమాచారం అందుతోంది.

స్టార్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.కోవై సరళ అభినేత్రి2 తర్వాత తెలుగులో మరో సినిమాలో నటించలేదు.

Telugu Kovai Sarala, Risky, Sembi-Movie

సెంబి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే కోవై సరళకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.రిస్కీ రోల్స్ లో నటించడానికి కూడా కోవై సరళ ఆసక్తి చూపుతుండటంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube