ఆ ముగ్గురు స్టార్ హీరోస్ తో నటించాలని ఉందటున్న నటి.. ఎవరంటే?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు.వారితో నటించడానికి ఎంతోమంది హీరోయిన్స్ క్యూ కడుతుంటారు.

 Actress Kavya Thapar Interested To Act With Star Heroes, Actress Kavya Thapar ,-TeluguStop.com

కానీ స్టార్ హీరోల సరసన నటించడానికి చాలా వరకు స్టార్ హీరోయిన్స్ కు మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది.చిన్న హీరోయిన్స్ కి అవకాశం రావడం చాలా తక్కువ.

ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు నటిస్తూనే ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో యంగ్ హీరోయిన్ కు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉందట.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు.

2018లో రాము కొప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ మాయ పేరేమిటో.వి ఎస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా లో తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ కావ్య థాపర్.2013లో హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవగా కేవలం ఒక సినిమాలోనే నటించింది.ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన.తర్వాత ఏడాది తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఏక్ మినీ కథ సినిమా తో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.యూత్ ఫుల్ ఎంటర్ టైన్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఇందులో కావ్య నటనకు పలువురు నిర్మాతలు ఫిదా అవగా తమ సినిమాలలో నటించడానికి అవకాశాలు కూడా ఇస్తున్నారని తెలిసింది.ఇక తాజాగా తెలుగు ఇండస్ట్రీ నుంచి స్వాగతం అందడంతో కొన్ని విషయాలు పంచుకుంది.

తను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడానికి తెలుగు నేర్చుకుంటున్నట్లు తెలిపింది.ఇక ఈ బ్యూటీకి చిరంజీవి, ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమట.అంతేకాకుండా తనకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్, రామ్ చరణ్, నాని లతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube