సోనూసూద్ ఫ్యాన్స్ పై కవిత ఫైర్.. అసలేమైందంటే..?

ఈ మధ్య కాలంలో సోనూసూద్ పేరు ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తన సేవా గుణంతో, ఉదార స్వభావంతో సోనూసూద్ తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

 Actress Kavitha Koushik Fires On Sonusood Fans, Kavitha Koushik, Sonusood Fans,-TeluguStop.com

సోనూసూద్ చేస్తున్న మంచి పనులను ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు.ఎవరైనా తమకు సహాయం కావాలంటే సోనూసూద్ ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు సోనూసూద్ అభిమానులు సైతం తమ వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే తాజాగా సోనూసూద్ ఫ్యాన్స్ చేసిన ఒక పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సోనూసూద్ పై ఉన్న అభిమానంతో కొందరు అభిమానులు పాలాభిషేకం చేశారు.తమకు సోనూసూద్ పై ఉన్న అభిమానాన్ని ఫ్యాన్స్ ఆ విధంగా చాటుకున్నారు.అయితే నటి కవిత కౌశిక్ సోనూసూద్ ఫ్యాన్స్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

సోనూసూద్ నిస్వార్థంగా సేవలు చేస్తున్నారని ఆమె అన్నారు.

సోనూసూద్ చేస్తున్న సేవలకు దేశమంతా రుణపడి ఉంటుందని ఆమె వెల్లడించారు.

Telugu Actresskavitha, Covid, India Corona, Kavitha Koushik, Orphanage, Sonusood

ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉంటే సోనూసూద్ సహాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.అయితే సోనూసూద్ ఫ్యాన్స్ మాత్రం పాలను వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని కవిత కౌశిక్ వెల్లడించారు.సోనూకు ఈ విషయం తెలిస్తే సోనూసూద్ కూడా అందుకు అంగీకరించరని కవిత కౌశిక్ వెల్లడించారు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని కవిత కౌశిక్ వెల్లడించారు.

పాలను వృథా చేసే బదులు ఆ పాలను అనాథశ్రమానికి దానం చేస్తే మంచిదని వెల్లడించారు.అయితే కవిత కౌశిక్ ట్వీట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కొందరు నెటిజన్లు మాత్రం సోనూసూద్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో మంచి పనులు చేస్తున్నారని అలాంటి వ్యక్తికి పాలాభిషేకం చేసినా తప్పు లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube