పెళ్లి కోసం విక్కీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన కత్రినా కైఫ్.. ఎందుకంటే?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తాజాగా డిసెంబర్ 9 న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు.రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం జరిగింది.

 Actress Katrina Kaif Paying 75 Percent Wedding Expenses And Vicky Kaushal Not Ha-TeluguStop.com

అయితే ఇంతకుముందు ఈ ప్రేమ జంట పెళ్లికి ముందే అంటే దాదాపుగా ఒక నెల రోజులు నుంచి వార్తలు వినిపిస్తూనేవున్నాయి.ఇక గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించి రోజుకో కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీ లో చాలా మంది సెలబ్రిటీలు సిక్రెట్ గా పెళ్లి చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇంకొందరు పెళ్లి సింపుల్ గా చేసుకొని ఆ తరువాత రిసెప్షన్ ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు.

పెళ్లి తరువాత వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మంచి ధరకి వెబ్‌సైట్‌లకి అమ్ముకుంటున్నారు.ఇప్పటికే గతంలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఇలా చేసారు.

తాజాగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా దాదాపు 100 కోట్లకి ఫోటోస్, వీడియోస్ ని  అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం, విక్కీ, కత్రినా పెళ్లి చేసుకున్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ యాజమాన్యం ప్రమోషన్ కోసం ఉచితంగానే తమ హోటల్‌ని కేటాయించిందట.

Telugu Bollywood, Katriankaif, Katrina Kaif, Rajasthan Fort, Senses Fort, Strict

ఇకపోతే ట్రావెలింగ్ అలాగే సెక్యూరిటీ తదిరత విషయాలలో డెసిషన్ కత్రినానే తీసుకున్నట్లు సమాచారం.ఇలాంటి విషయాల్లో విక్కీ చాలా తక్కువగా ఇన్‌వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది.వీరి పెళ్లికి అయ్యే ఖర్చులో దాదాపుగా 75 శాతం వరకు ఖర్చులను కత్రినానే బరించినట్లు తెలుస్తోంది.మిగిలిన 25 శాతాన్ని మాత్రమే విక్కీ ఖర్చు చేస్తున్నాడని సమాచారం.

అంతేకాకుండా ఫుటేజీ అమ్మకం, సెల్ ఫోన్స్ నిషేధించడం ఇలాంటి రూల్స్ అన్ని కత్రినా కైఫ్ తీసుకుందట.కాగా, పెళ్లి కవరేజీ కోసం మీడియాకి పర్మిషన్ లేకపోవడంపై ఈ యంగ్ హీరో సంతోషంగా లేడని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube