బిగ్ బాస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదంటున్న ప్రముఖ నటి..!  

Actress Kasturi Sensational Comments on Bigg Boss Show, Bigg Boss Show, Actress Kasturi, Vijay Telivision, Bigg Boss Payment, Bigg Boss Season4 - Telugu Actress Kasturi, Actress Kasturi Sensational Comments On Bigg Boss Show, Bigg Boss Payment, Bigg Boss Season4, Bigg Boss Show, Kasturi, Tamil Bigg Boss, Vijay Telivision

బుల్లితెర రియాలిటీ షోలు ఎన్ని ఉన్నా ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ప్రత్యేకం.ఇతర షోలతో పోల్చి చూస్తే బిగ్ బాస్ షో అందించే ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.

TeluguStop.com - Actress Kasturi Vijay Telivision Bigg Boss Remuneration

అందువల్లే బిగ్ బాస్ షో ను దేశవ్యాప్తంగా అనేక భాషల్లో ఆదరిస్తున్నారు.ఈ షోకు వెళ్లిన సెలబ్రిటీలకు పేరుతో పాటు భారీ మొత్తంలో పారితోషికం కూడా లభిస్తుంది.

రోజుకు 10,000 నుంచి లక్ష రూపాయల వరకు పారితోషికం పొందే అవకాశం ఉంటుంది.

TeluguStop.com - బిగ్ బాస్ డబ్బులు ఇంకా ఇవ్వలేదంటున్న ప్రముఖ నటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందువల్లే సెలబ్రిటీలు సైతం ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు.

అయితే బిగ్ బాస్ కు రియాలిటీ షోగా ఎంత మంచి పేరు ఉందో అదే స్థాయిలో ఈ షోను వివాదాలు వెంటాడుతూ ఉంటాయి.తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న ప్రముఖ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెలుగు, తమిళంలో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి ప్రస్తుతం పలు సీరియళ్లలో నటిస్తోంది.

వివాదాస్పద విషయాలపై కామెంట్లు చేస్తూ కస్తూరి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ట్విట్టర్ వేదికగా కస్తూరి బిగ్ బాస్ షోలో పాల్గొని సంవత్సరం గడిచినా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని చెప్పుకొచ్చింది.తనకు సీజన్ 3 పేమెంట్ ఇవ్వకుండా సీజన్ 4 స్టార్ట్ చేస్తున్నారంటూ కస్తూరి విజయ్ టీవీ యాజమాన్యంపై విమర్శలు చేశారు.

తమిళ బిగ్ బాస్ పై కస్తూరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

కస్తూరి లాంటి ప్రముఖ నటికే బిగ్ బాస్ డబ్బులు చెల్లించకపోతే షోలో పాల్గొన్న చిన్న సెలబ్రిటీల పరిస్థితేంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సెటైరికల్ గా విజయ్ టీవీకి కృతజ్ఞతలు చెబుతూ కస్తూరి చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.అనాథ పిల్లల కొరకు తాను బిగ్ బాస్ లో పాల్గొన్నానని.

తాను విజయ్ టీవీ తప్పుడు వాగ్దానాన్ని నమ్మానని అన్నారు.

#ActressKasturi #Tamil Bigg Boss #Actress Kasturi #Kasturi #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Kasturi Vijay Telivision Bigg Boss Remuneration Related Telugu News,Photos/Pics,Images..