సీఎంపై గృహలక్ష్మి కస్తూరి షాకింగ్ కామెంట్స్..?

బుల్లితెర సీరియల్ గృహలక్ష్మి సీరియల్ తో తెలుగు బుల్లి తెరకు పరిచయమైన నటి కస్తూరి శంకర్. ఈమె గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

 Gruhalakshmi Serial Fame Kasturi Shocking Comments On Cm Stalin, Gruhalakshmi, K-TeluguStop.com

అప్పట్లో వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది కస్తూరి.ఇక ఈమె సీరియల్ లో ఎంత సైలెంట్ గా ఉంటుందో బయట జరిగే విషయాలలో అంత వైలెంట్ చేస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది కస్తూరి.

ఏదో ఒక విషయం తో తన సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారుస్తుంది.

ఎక్కువగా రాజకీయ విషయాలలో బాగా పట్టుతో ఉంటుంది కస్తూరి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులను పలుమార్లు విమర్శించింది.

అంతేకాకుండా ఆ మధ్య బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన దాడి గురించి కేంద్ర మంత్రిని కూడా ట్రోల్ చేసింది.ఇటీవలే సినీ నటుడు రజనీకాంత్ మీద కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా మరో సీఎంపై షాకింగ్ కామెంట్స్ చేసింది కస్తూరి.

సీఎం స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఉదయం పూట సైకిల్ తొక్కుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకున్నాడు.దీంతో నెటిజన్లు ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.

అంతేకాకుండా కస్తూరి కూడా తన ట్విట్టర్ వేదికగా సీఎం స్టాలిన్ ను పొగిడింది.ఎంకే స్టాలిన్ ఓ రాక్ స్టార్ అంటూ అద్భుతమైన సీఎం, వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని పొగిడింది కస్తూరి.

కానీ అంతలోనే తనలో ఉన్న తప్పును పట్టుకుంది.సీఎం సార్ ప్రజల్లోకి ఇలా వచ్చినప్పుడు మాస్కు ధరించండి అంటూ.మీ ఫోటోలతో మాస్క్ ధరించడం పై అవగాహన కల్పించండి అంటూ తన స్టైల్లో స్పందించింది కస్తూరి.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారగా నెటిజన్లు కస్తూరి చేసిన కామెంట్ కు బాగా స్పందిస్తున్నారు.

నిజమే మాస్కు ధరించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube