నటి కస్తూరిని వేధించిన ప్రముఖ హీరో  

Actress Kasthuri reveals Facing Harassment in Film Industry, Kollywood, Anurag Kashyap, MeToo, Payal ghosh, Actress Kasthuri - Telugu Actress Kasthuri, Actress Kasthuri Reveals Facing Harassment In Film Industry, Anurag Kashyap, Kollywood, Metoo, Payal Ghosh

బాలీవుడ్ లో ఓ వైపు డ్రగ్స్ కేసు కలకలం రేపితే మరో వైపు దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ నేపధ్యం సోషల్ మీడియాలో నెటిజన్లు పాయల్ ఘోష్ కి మద్దతుగా నిలబడితే బాలీవుడ్ సెలబ్రెటీలలో చాలా మంది అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా మాట్లాడారు.

TeluguStop.com - Actress Kasthuri Reveals Facing Harassment In Film Industry

అనురాగ్ కశ్యప్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కాదని, అతను మహిళల హక్కుల కోసం పోరాడే మనస్తత్వం ఉన్నవాడిని హీరోయిన్స్ సైతం కితాబు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ ఇష్యూపై సౌత్ ఇండియా వెటరన్ హీరోయిన్, బోల్డ్ యాక్టర్ గా తన మాటలతో, చేతలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి స్పందించింది.

రాజకీయ నాయకులపై కూడా ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పే కస్తూరి సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుతూ తాను కూడా నటిగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - నటి కస్తూరిని వేధించిన ప్రముఖ హీరో-General-Telugu-Telugu Tollywood Photo Image

నటి పాయల్ ఘోష్ అనురాగ్ పై చేసిన ఆ ఆరోపణలు కోర్టులో నిలవలేవంటూ తన న్యాయపరమైన అభిప్రాయాన్ని కస్తూరి పంచుకుంది.

స్పష్టమైన ఆధారాలు లేకుండా లైంగిక వేధింపుల ఆరోపణలు నిరూపించటం అసాధ్యమని చెప్పింది.అయితే ఈ ఆరోపణలు ఇద్దరిలో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీ కుటుంబంలో గానీ లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరికైనా జరిగితే ఇలానే మీరు చట్టపరమైన అభిప్రాయాన్ని ప్రస్తావిస్తారా అని ప్రశ్నించారు.దానిపై స్పందించిన కస్తూరి తన జీవితంలోనే అలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది.

తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.చాన్స్ ల పేరుతో గదికి రమ్మనే అలవాటు సినీ పరిశ్రమలో ఉన్నట్లు అంగీకరించింది.

ఒక హీరో తనను రమ్మన్నాడని, ఒప్పుకోక పోవడం వలన తనకి చాన్స్ లు రాకుండా చేశాడని ఆరోపించింది.ఆ హీరో ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాడని చెప్పుకొచ్చింది.

అయితే సదరు హీరో ఎవరనే విషయం మాత్రం కస్తూరి ప్రస్తావించలేదు.

#Kollywood #Payal Ghosh #Anurag Kashyap #MeToo #ActressKasthuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Kasthuri Reveals Facing Harassment In Film Industry Related Telugu News,Photos/Pics,Images..