మరోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

కరీనా కపూర్ గర్భవతి అని గత కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి అభిమానుల‌ను ఆనంద పరిచింది.కడుపుతో ఉన్న సమయంలో కూడా యోగాసనాలు, షూటింగ్ లో పాల్గొనడం లాంటివి చేసింది.

 Bollywood Heroine Kareena Kapoor Gave Birth To Baby Boy,  Kareena Kapoor, Saif A-TeluguStop.com

అయితే తాజాగా కరీనా ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.శనివారం రాత్రి ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనా కపూర్ అడ్మిట్ అయ్యారు.

ఆదివారం (ఫిబ్రవరి 21)న కరీనా కపూర్ డెలివరీ అయ్యారని తెలుస్తుంది.

ఇప్పుడు కరీనా కపూర్ సెకండ్ చైల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నటుడు సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే సైఫ్ అలీఖాన్ కి ఇది రెండో వివాహం.

ఇప్పుడు కరీనా కపూర్ మరియు సైఫ్ అలీఖాన్ కి మొదటి సంతానంగా 2016లో తైమూర్ అలీ ఖాన్ అనే కుమారుడు జన్మించాడు.మళ్ళీ ఇప్పుడు రెండో బిడ్డకి జన్మ నిచ్చింది.

తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తుంది.

సైఫ్ అండ్ కరీనా ఇరువురు కుటుంభ సభ్యులు ఆనందంలో ఉన్నారు.

ప్రస్తుతం కరీనా కపూర్ అమీర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్దా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు సైఫ్ అండ్ కరీనా దంపతులకు అభినందనలు తెలియ చేస్తున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు.

కరీనా బిడ్డకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube