Kangana Ranaut: ఆ జంటను ఉద్దేశించి సంచలన పోస్ట్ చేసిన కంగనా.. డబ్బుకోసం పెళ్లి చేసుకుంటే ఇట్లే ఉంటుందంటూ?

బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( Kangana Ranaut ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కంగనా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.కేవలం సమాజంలో జరిగే విషయాలపై మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కూడా ప్రత్యేకంగా పరోక్షంగా స్పందిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది.కంగనా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగింది కంగనా.తరచూ ఏదోక వివాదాస్పద ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిలిచే కంగాన తాజాగా మరో సంచలన ట్వీట్ చేసింది.

Advertisement

దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందా అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.

కంగనా రనౌత్‌, కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి( Vijay Setupathi ) కలిసి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఓ చిత్రం చేయబోతున్నారంటూ ఇటీవల వార్తలు విపించాయి.

ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా సంబంధిత న్యూస్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తాయి.ఆ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ నేనెప్పుడు ఏ సినిమాని ప్రకటించినా ప్రకటించబోతున్నా ఇలాంటి నెగెటివ్‌ ప్రచారం జరుగుతుంది.అన్ని వెబ్‌సైట్లలోనూ ఒకే హైడ్‌లైన్‌ ఉండడానికి కారణమేంటి? దీనినే బల్క్‌ మాస్‌ మెయిల్‌( Bulk Mass Mail ) అంటారు.ప్రియమైన చాంగు మంగు మీ మంచి కోసం నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను అని పేర్కొంది.

బాలీవుడ్‌కు చెందిన ఒక జోడీనే పలువురు నెటిజన్స్ తో ఈ ట్రోలింగ్‌ చేయించిందని కంగనా ఆరోపించింది.ఈ మేరకు మరో పోస్ట్‌ పెట్టింది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

విడిగా ఉండే ఒక నకిలీ జోడీ ఇటువంటి ప్రచారం చేయిస్తోంది.భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్రకు వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు.సదరు భర్త నాకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

Advertisement

చర్చించేందుకు నన్ను కలవమని అంటున్నాడు.సినిమాలు, డబ్బు కోసం వివాహం చేసుకుంటే ఇలానే ఉంటుంది.

ఈ నటుడు మాఫియా డాడీ ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నాడు.ఫేక్‌ మ్యారేజ్‌ నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు.

కానీ, అతడికి సాయం చేసేవారు ఎవరూ లేరు.భార్య, కుమార్తెపైనే అతడు దృష్టి పెట్టాలి.

ఎందుకంటే ఇది భారత్‌.ఒక్కసారి పెళ్లి అయితే.

అంతే అంటూ సంచలన ట్వీట్ చేసింది కంగనా.అయితే కంగాన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌లు పెట్టిందో తెలియకపోవడంతో నెటిజన్లు సందేహంలో పడ్డారు.

తాజా వార్తలు