రీ ఎంట్రీకి రెడీ అవుతున్న క్యూట్ బ్యూటీ కామ్నా..

సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే.హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ.

 Actress Kamna Jethamalani Reentry In Tollywood-TeluguStop.com

పెళ్లయ్యక చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరం అవుతారు.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

పెళ్లికి ముందు సక్సెస్ ఫుల్ హీరోయిన్లుగా కొనసాగిన వారు.ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి.

 Actress Kamna Jethamalani Reentry In Tollywood-రీ ఎంట్రీకి రెడీ అవుతున్న క్యూట్ బ్యూటీ కామ్నా..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

తాజాగా ఈ పరిస్థితి మారుతోంది.

పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు చాలా మంది హీరోయిన్లు.తెలుగులో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంతా.

సినిమాల్లో నటిస్తూనే ఉంది.ప్రస్తుతం అదే దారిలో నడుస్తోంది హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ.

తెలుగులో గోపీచంద్ తో కలిసి రణం సినిమా చేసింది.ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది.

అయితే ఆమె పలు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.అడపా దడపా సినిమాలు చేసినా మంచి గుర్తింపు రాలేదు.

ఆమె నటించిన చాలా సినిమాలు యావరేజ్ గా నడిచాయి.ఒకటి అర మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి.

Telugu Actress Kamna Jethmalani, Gopichand, Grand Daughter Of Lawyer Ram Jethmalani, Kamna Jethmalani, New Director Prabhu, Ranam Movie Heroine, Re Entry In Tollywood, Tollywood Entry-Telugu Stop Exclusive Top Stories

క్యూట్ బ్యూటీ కామ్నా జెఠ్మలానీ చాలా వరకు చిన్న సినిమాలు, స్పెషల్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగకపోవడంతో.కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుంది.అనంతరం సినిమాలకు దూరం అయ్యింది.ప్రస్తుతం మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తుంది.ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతుంది.

Telugu Actress Kamna Jethmalani, Gopichand, Grand Daughter Of Lawyer Ram Jethmalani, Kamna Jethmalani, New Director Prabhu, Ranam Movie Heroine, Re Entry In Tollywood, Tollywood Entry-Telugu Stop Exclusive Top Stories

తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కొత్త దర్శకుడు ప్రభు తెరకెక్కిస్తున్న సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతుంది.అయితే ఈ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని మళ్లీ సినిమా పరిశ్రమలో సత్తా చాటాలి అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

కామ్నా జెఠ్మలానీ.ప్రముఖ దివంగత న్యాయవాది రామ్ జెఠ్మలానీ మనువరాలు కావడం విశేషం.

#Prabhu #Gopichand #Ranam #ActressKamna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు