యంగ్ హీరోతో సాహసం చేసేందుకు సిద్ధం అవుతున్న నటి.!?

కల్యాణి దక్షిణ భారతదేశానికి చెందిన నటి.ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది.

 Actress Kalyani Re Entry As A Director With Young Hero Chetan Cheenu-TeluguStop.com

బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కల్యాణి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది.

దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది.ప్రస్తుతం మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.

 Actress Kalyani Re Entry As A Director With Young Hero Chetan Cheenu-యంగ్ హీరోతో సాహసం చేసేందుకు సిద్ధం అవుతున్న నటి.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.ఈ హీరోయిన్ అప్పట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే సినిమా చేసింది.ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యిన కళ్యాణి తర్వాత హీరోయిన్ గా రాణించింది.చాలా రోజులు సినిమాలకు దూరం అయిన ఈమె త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

అది కూడా డైరెక్టర్ గా ఈమె ఈసారి ఇండస్ట్రీకి పరిచయం కానుంది.చేతన్ శీను అనే యువ హీరో ను తన దర్శకత్వం తో పరిచయం చేయనుందని సమాచారం.

Telugu Actress Kalyani, Best Actor, Chetan Cheenu, Director, Director As Industry, Kalyani, Kalyani Re Entry, Movie Updates, Nandi Awardee, Re Entry As A Director, Surya Kiran, Young Hero Chetan Cheenu-Latest News - Telugu

ఇక ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టానున్నారని కళ్యాణీ టీమ్ తెలిపింది.ఈ సినిమా గ్లిమ్స్ ను హోలీ పండుగ సందర్భంగా మంచి ప్రశంసలు వచ్చాయి.మొత్తానికి కళ్యాణి రీ ఎంట్రీ తో డైరెక్టర్ గా పరిచయం కానుందని తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తన భర్త గురించి చూసినట్లైతే సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన దర్శకుడు సూర్య కిరణ్.

గత ఏడేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు.రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యారు.ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2016లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఆ సమయంలో కళ్యాణి తన లైఫ్‌లో లేకపోవడం తీరని లోటే అంటూ భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు సూర్యకిరణ్.

ఆ సందర్భంలో కళ్యాణి తనకు అమ్మ తరువాత అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.

#DirectorAs #Nandi Awardee #Chetan Cheenu #Surya Kiran #Kalyani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు