పవన్ కళ్యాణ్ సెట్ లో నన్ను అలా చేస్తాడనుకోలేదు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు.స్టార్ హీరో స్టేటస్ ని ఏ మాత్రం అనుభవించకుండా చాలా సాధారణంగా ఉంటాడు పవన్ కళ్యాణ్.

 Actress Jyothi Shocking Comments About Pawan Kalyan, Actress Jyothi , Pawan Kaly-TeluguStop.com

ఇటు సినిమాలకు ఇటు రాజకీయాలకు సరిగ్గా సమయాన్ని కేటాయిస్తూ పవర్ స్టార్ గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.ప్రతి ఒక్క హీరోకు హిట్స్, ఫ్లాప్స్ ను బట్టి అభిమానులు పెరగడం, తగ్గడం అనేది ఉంటుంది.

కాని పవన్ విషయంలో ఇది తప్పు అని చాలా సార్లు రుజువయింది.బయట పవన్ కళ్యాణ్ క్రేజ్, పేరు చూసి కొత్తగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే వారికి పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా భయం ఉంటుంది.

కాని ఆయనతో నటించిన వారు చెప్పే మాట అయన సెట్ లో ఉన్నప్పుడు పవర్ స్టార్ అనేది ఎక్కడా కనిపించదని.చాలా సరదాగా కొత్త నటీనటులు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే వారిని స్వయంగా పిలిచి వారి గురించి అడిగి వాళ్ళను కంఫార్ట్ చేస్తారు.

అలా పవన్ కళ్యాణ్ తో నటించిన ప్రతి ఒక్కరికి గొప్ప ఎక్స్ పీరియన్స్ ఉంటుంది.ఇది ఇలా ఉంటే నటి జ్యోతి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్ లో నాపై ఓ కవిత రాసి దాన్ని చదివి అందరినీ ఖుషీ చేసాడని, పవన్ కళ్యాణ్ నాపై కవిత రాయడం, ఆ షూటింగ్ సన్నివేశాలు ఇదంతా నా జీవితంలో సంతోషంగా గడిపిన వాటిల్లో చాలా ప్రత్యేకతగా ఉంటుందని నటి జ్యోతి చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube