ఈ ప్రముఖ నటి బాబుతో నడిరోడ్డుపై కూర్చొని ఏడ్చిందట.. ఏమైందంటే?

18ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి M.S.రెడ్డి దర్శత్వంలో వచ్చిన అందం అనే సినిమాలో నటించి తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి జ్యోతి.ఓ మై లవ్, హంగామా లాంటి చిత్రాల్లో లీడ్ పాత్ర పోషించి మంచి విజయాన్ని అందుకున్నారు.

 Actress Jyothi Comments About Casting Couth And Tollywood Industry-TeluguStop.com

అంతే కాకుండా ది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో ఛాన్స్ దక్కించుకున్న నటులలో ఒకరు జ్యోతి.ఇక పోతే ఒక అమ్మాయి సినీ ఇండస్ట్రీలో ఎలా ఉండాలన్న అంశంపై నటి జ్యోతి మాట్లాడుతూ.

అమ్మాయికి సినిమాపై నిజంగా ఫ్యాషన్ అనేది ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం చేరుకోవాలి.టార్గెట్‌ను రీచ్‌ అయ్యే మార్గంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి.అవి కామన్.కాని వాటికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనేదే ఇంపార్టెంట్ అని సమాధానమిచ్చారు జ్యోతి.

 Actress Jyothi Comments About Casting Couth And Tollywood Industry-ఈ ప్రముఖ నటి బాబుతో నడిరోడ్డుపై కూర్చొని ఏడ్చిందట.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తానెప్పుడూ ఎవరినీ నమ్మొద్దని అనుకున్నా మళ్లీ నమ్మి తర్వాత ఫీలైతానని ఆమె అన్నారు.

ఒకానొక సందర్భంలో నటుడు ఏవీఎస్‌ కూడా తనకు నటన రాదన్నారని జ్యోతి తెలిపారు.

దాంతో ఇంకా ఏదైనా చేయాలనే కోరిక బలంగా పేరుకుపోయిందని ఆమె అన్నారు.కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్న జ్యోతి… ఎవరు ఎప్పుడు చేసిన వాళ్లకు వెంటనే తగులుతుందని అన్నారు.

ఇదిలా ఉండగా తను ఒకానొక సందర్భంలో ఇల్లు లేక ఇబ్బంది పడ్డానని జ్యోతి తెలిపారు.ఆ సమయంలో తనకు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని కనీసం ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా ఆలోచించారని ఆమె వాపోయారు.

ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ దూరమయ్యారని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు.

Telugu Actress Jyothi, Actress Jyothi Cried On Roads, Actress Jyothi Movie Experience, Andam Movie, Avs, Jyothi About Casting Couch, Latest Interview, Ms Reddy, Tollywood-Movie

తన రెండేళ్ల బాబుని తీసుకొని నడి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లానని ఆమె పాడిన బాధను గుర్తు చేసుకున్నారు.ఇక అప్పుడే అనుకున్నాను… ఎలాగైనా ఒక ఇల్లు కొనాలి అని జ్యోతి తెలిపారు.కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన జ్యోతి మన పర్మిషన్ లేనిదే మనపై ఎవరూ చేయి వేయరని ఆమె అన్నారు.

అవసరం అయితే ఫైట్ చెయ్యాలని ఇంటర్వ్యూ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.

#Andam #ActressJyothi #ActressJyothi #Jyothi #Actress Jyothi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు