నా తండ్రి చనిపోయినప్పుడు మీడియా అంత చెత్తగా రాసింది.! విడాకులకు కారణం చెప్పిన జ్యోతి.!   Actress Jyothi About Her Divorce     2018-11-09   12:08:16  IST  Sainath G

“పెళ్ళాం ఊరెళ్తే” సినిమాలో చేశాను!…
అలా అని మీ పెళ్ళాం ఊరెళ్ళగానే నాకు ఫోన్ చేయమని కాదు!
ఈ మాటలు అనింది “జ్యోతి”…కొన్ని అలంటి పాత్రలు చేసింది అని చాలా మంది ఆమెని తప్పుగా చూస్తున్నారు…అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు!…కానీ అవి సినిమాల వరకే పరిమితం అంటుంది “జ్యోతి”…కాయిన్ కి రెండు ముఖాలు ఉంటాయి..కానీ మీరు నాలో ఒక సైడ్ మాత్రమే చూసారు..నా గురించి తెలియకుండా మాట్లాడకండి అంటుంది!…తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది పై అసభ్య పదజాలంతో కూడా ఫైర్ అయ్యింది!

అలీతో సరదాగా కార్యక్రమంలో జ్యోతి మాట్లాడుతూ.. 2002 లో మందారం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యా. నాట్యంపై నాకు ఉన్న ఆసక్తి చూసి మా నాన్నే నన్ను ఇండస్ట్రీకి వెళ్లేలా ప్రోత్సహించారు అని జ్యోతి తెలిపింది. కానీ నేనెప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. నేను నటిగామారడం అనుకోకుండా జరిగిన సంఘటన అని జ్యోతి తెలిపింది. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా జ్యోతి ప్రస్తావించింది. చాలా యంగ్ ఏజ్ లోనే నాకు వివాహం జరిగింది. నాకు బాబు కూడా ఉన్నాడు. మా వారు, నేను విడాకుల ద్వారా విడిపోయాం. మెచ్యూరిటీ లేకపోవడం వలనే ఆలా జరిగింది అని జ్యోతి తెలిపింది. ఆ బాధ నన్ను వేధిస్తోంది తన వివాహ జీవితం, కొడుకు గురించి మాట్లాడుతూ జ్యోతి ఎమోషనల్ అయింది. కన్నీరు పెట్టుకుంది. నా కొడుకు వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు చాలా భాధగా అనిపిస్తుంది. మా ఇద్దరి గొడవల వలన వాడికి తండ్రి దూరమయ్యాడే అని ఎప్పుడూ భాదపడుతోనే ఉంటా అంటూ జ్యోతి కంటతడి పెట్టుకుంది.

Actress Jyothi About Her Divorce-

ఈ సందర్బంగా మీడియా పై కూడా ఫైర్ అయ్యింది..తన తండ్రి చనిపోయినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే..సోషల్ మీడియాలో చాలా చెత్తగా రాసారు అంట!ఎయిర్ పోర్ట్ లో టికెట్ కోసం నిల్చుని ఉంటె.. విచ్చలవిడిగా తిరిగేస్తోంది చూడు అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ తో నా మతి పోయింది అని జ్యోతి తెలిపింది.ఇక అవి పట్టించుకోవడం మానేశా చెప్పేసింది!

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.