అలా ఉంటే మాత్రమే సినిమా ఆఫర్లు వస్తాయి.. జయవాణి కామెంట్స్ వైరల్!

Actress Jayavani Interesting Comments About Movie Roles

తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా నటిగా జయవాణి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఒక ఇంటర్వ్యూలో జయవాణి మాట్లాడుతూ తాను, వేణు మాధవ్ ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టామని ఈ ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ హెల్ప్ చేయరని తెలిపారు.

 Actress Jayavani Interesting Comments About Movie Roles-TeluguStop.com

సినిమా రంగంలో ఎవరి జర్నీ వారిదని మా అమ్మాయి అని చెప్పినా దర్శకుడికి నచ్చితేనే సినిమా ఆఫర్ ఇస్తారని జయవాణి కామెంట్లు చేశారు.

బాగా చేస్తారని మాత్రం చెప్పగలమని అంతకు మించి సహాయం చేయలేమని జయవాణి చెప్పుకొచ్చారు.

 Actress Jayavani Interesting Comments About Movie Roles-అలా ఉంటే మాత్రమే సినిమా ఆఫర్లు వస్తాయి.. జయవాణి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా అనేది ఒక ప్రపంచం అని ఈ ఇండస్ట్రీలో అందరూ సెటిల్ కాలేరని జయవాణి తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఆ పిచ్చి ఉండాలని జయవాణి చెప్పుకొచ్చారు.

ఎప్పటికప్పుడు నేను అనేది తగ్గించుకుంటూ క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదగ గలమని జయవాణి అన్నారు.

మా ఆయన సుందరయ్య అనే మూవీలో నటించే సమయంలో ఎవరితో మాట్లాడేదానిని కాదని ఆమె తెలిపారు.

మనోరమ తనతో ఎక్కువ సినిమాలు చేయాలంటే ఇండస్ట్రీలో అణుకువతో ఉండాలని చెప్పారని జయవాణి అన్నారు.అందరివాడు సినిమా షూటింగ్ లో తాను మూడు రోజులు పాల్గొన్నానని తన సీన్లు అన్నీ కట్ అయ్యాయని జయవాణి తెలిపారు.

కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ ఆలస్యమైనా తాను నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని జయవాణి చెప్పుకొచ్చారు.

Telugu Offers, Jayavani-Movie

ఆంధ్రుడు సినిమాలో తాను నటించానని అయితే సునీల్, తన కాంబోలో వచ్చిన సీన్లు అన్నీ కట్ చేశారని జయవాణి వెల్లడించారు.ఇండస్ట్రీ చాలా పెద్దదని ఆర్టిస్టులు చాలామంది ఉంటారని అందువల్లే కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో నటించానని జయవాణి అన్నారు.రాజమౌళి మంచిమంచి పాత్రలు ఆఫర్ చేస్తే తాను నో చెప్పలేకపోయానని జయవాణి చెప్పుకొచ్చారు.

పాత్రలు వేస్తూ వస్తేనే గుర్తింపు వస్తుందని జయవాణి వెల్లడించారు.

#Offers #Jayavani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube