నల్లగా ఉన్నానని నాకు అవకాశాలు ఇవ్వలేదు.. అలా అవమానించారంటున్న ప్రముఖ నటి?

తెలుగులో కొంతమంది నటీనటులు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించినా గుర్తింపును సొంతం చేసుకుంటారు.టాలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో జయవాణి కూడా ఒకరు.

 Actress Jayavani Interesting Comments About Her Color Details, Color, Actress Ja-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో జయవాణి మాట్లాడుతూ కెరీర్ పరంగా తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.తనకు విలన్ పాత్రలు సినిమాల్లో ఎక్కువగా వచ్చాయని జయవాణి తెలిపారు.

సినిమాల్లో ఫిమేల్ విలన్ రోల్స్ తక్కువని ఆమె వెల్లడించారు.ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని జయవాణి వెల్లడించారు.

తాను ఏ పాత్ర ఇచ్చినా చేయగలనని ప్రూవ్ చేసుకున్నానని జయవాణి అన్నారు.ఇకపై బోల్డ్ రోల్స్ లో చేయాలని తనకు లేదని జయవాణి వెల్లడించారు.

ఊహ తెలిసిన సమయం నుంచి తనకు ఇండస్ట్రీ ఇష్టమని జయవాణి అన్నారు.డాడీ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని జయవాణి చెప్పుకొచ్చారు.

సినిమాలపై ఉండే ఆసక్తితోనే తాను ఈ ఇండస్ట్రీకి వచ్చానని జయవాణి  తెలిపారు.మమ్మీ, డాడీ ఇద్దరూ జాబ్ చేసేవారని జయవాణి వెల్లడించారు.

Telugu Black Color, Characterartist, Color, Female Villain, Jayavani, Offers, Di

మామయ్యను తాను పెళ్లి చేసుకున్నానని జయవాణి అన్నారు.తన భర్త తనకు ఎటువంటి షరతులు పెట్టలేదని జయవాణి వెల్లడించారు.స్టార్టింగ్ స్టేజ్ లో బ్లాక్ గా ఉండటం వల్ల తనకు కొన్ని ఆఫర్లు రాలేదని తాను ఈ విషయం ఇతరులకు చెబితే ఈమె బ్లాక్ గా ఉందా? అని వాళ్లకు కూడా అనిపిస్తుందని జయవాణి పేర్కొన్నారు.ఇవి చెప్పుకునేవి కావు అని జయవాణి వెల్లడించారు.

Telugu Black Color, Characterartist, Color, Female Villain, Jayavani, Offers, Di

ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఈ కామెంట్లు చేశారని జయవాణి వెల్లడించారు.ఆ తర్వాత మేకప్ నేర్చుకుని ఆ సమస్యను అధిగమించానని జయవాణి చెప్పుకొచ్చారు.తనకు ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఎదురయ్యాయని ఆమె అన్నారు.ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లను సంపాదించుకుంటూ జయవాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube