గోపీచంద్ మూవీ చెయ్యలేదని నోటికొచ్చినట్టు మాట్లాడారు.. బాధపడ్డా.. నటి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన జయలక్ష్మి( Actress Jayalakshmi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.గోపీచంద్ మూవీ రామబాణం( Ramabanam Movie ) గురించి ఈ నటి ఈ కామెంట్లు చేశారు.

 Actress Jayalakshmi Comments About Gopichand Details, Actress Jayalakshmi, Gopic-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో అందరికీ నేను ఎలాంటి పాత్రలు చేస్తానో తెలుసని ఆమె తెలిపారు.కొన్నిసార్లు అజ్ఞానం వల్ల మంచి ఆఫర్లు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని జయలక్ష్మి కామెంట్లు చేశారు.

రామ్ చరణ్ మూవీ( Ram Charan ) ఒకటి మిస్ చేశానని ఆమె పేర్కొన్నారు.కొన్నిసార్లు డేట్స్ వల్ల రెండు విధాలుగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని జయలక్ష్మి వెల్లడించారు.

రామబాణం సినిమాలో చేయడానికి నేను ఆసక్తి చూపించానని ఒక సీన్ రెండు సీన్లు పూర్తి చేశామని అయితే వేర్వేరు కారణాల వల్ల షూటింగ్ డిలే అయిందని ఆమె అన్నారు.గోపీచంద్ కు( Gopichand ) ఫ్రాక్చర్ కావడం వల్ల ఆ సినిమా మరింత ఆలస్యమైందని పేర్కొన్నారు.

Telugu Gopichand, Jayalakshmi, Ram Charan, Ramabanam, Tollywood-Movie

నేను అమెరికాకు( America ) వెళ్లే డేట్ కు తర్వాత డేట్స్ ఇచ్చారని నేను అమెరికాకు వెళ్లాలని డేట్స్ ఇస్తే ఎలా షూట్ లో పాల్గొంటానని చెబితే సీరియస్ అయ్యారని ఆమె కామెంట్లు చేశారు.ఇక్కడ నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని జయలక్ష్మి( Jayalakshmi ) చెప్పుకొచ్చారు.ఫారిన్ ట్రిప్ వెళ్లేవాళ్లు సినిమాలు ఎందుకు చేయడం అని అన్నారని జయలక్ష్మి కామెంట్లు చేశారు.ఇలాంటి ఘటనల వల్ల ఇష్టానుసారం మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.

Telugu Gopichand, Jayalakshmi, Ram Charan, Ramabanam, Tollywood-Movie

నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నా మనస్సుతో మంచిగా ఆలోచిస్తానని అందువల్లే నాకు మంచిగా జరుగుతుందని నేను ఫీలవుతానని ఆమె పేర్కొన్నారు.ప్రతి ఆర్టిస్ట్ కు ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని జయలక్ష్మి వెల్లడించారు.ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.జయలక్ష్మి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube