వామ్మో.. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా?

మోడల్ గా, ప్రముఖ సినీ నటిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.2006 సంవత్సరంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంక తరపున మిస్ యూనివర్స్ పోటీకి ఎంపికయ్యారు.మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేయడం గమనార్హం.అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరీర్ ను మొదలుపెట్టారు.

 Actress Jacqualine Fernandez Has The Own Island And Other Assets Details, Jacque-TeluguStop.com

2011 సంవత్సరంలో రిలీజైన మర్డర్ 2 సినిమా ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.ఆ తర్వాత జాక్వెలిన్ కు గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా అవకాశాలు రాగా ఆ పాత్రల్లోనే జాక్వెలిన్ ఎక్కువగా నటించడం గమనార్హం.

అయితే ఈ మధ్య కాలంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో ఆరోపణలు రావడంతో ఈ నెల 8వ తేదీన జాక్వెలిన్ ఈడీ ముందు హాజరు కానున్నారు.

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జాక్వెలిన్ కు శ్రీలంకలో సొంతంగా ఒక దీవి కూడా ఉంది.

Telugu Assets, Bollywood, Jaqueline, Universe, Island, Srilanka Island, Sukeshch

సినిమాలతో పాటు ఈవెంట్లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా ఈ బ్యూటీ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఆస్తుల విలువ 75 కోట్ల రూపాయలుగా ఉంది.జాక్వెలిన్ వార్షిక ఆదాయం విషయానికి వస్తే ఈమె వార్షికాదాయం 8 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.

Telugu Assets, Bollywood, Jaqueline, Universe, Island, Srilanka Island, Sukeshch

సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి జాక్వెలిన్ కు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను ఇచ్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది.ఈ బహుమతులలో 9 లక్షల రూపాయల పెర్షియన్ పిల్లితో పాటు 52 లక్షల రూపాయల విలువైన గుర్రం ఉన్నాయని సమాచారం.హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube